కార్తీకమాసం(Karthika Masam) కావడంతో నిన్న, మొన్నటి వరకు గుడ్డు(Egg) ధర అందుబాటులో ఉండేది. కార్తీకమాసం ముగియడంతో.. నెలరోజుల పాటు మాసం ముట్టని నాన్‌వెజ్‌ ప్రియులు ఇప్పుడు చికెన్(Chicken), మటన్‌(Mutton), ఫిష్(Fish) మార్కెట్లకు బారులుకడుతున్నారు. దీంతో గత నెలరోజులుగా అందుబాటులో ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు కొండెక్కింది.

హైదరాబాద్‌లో గుడ్డు ధర రూ.6-6.50 ఉండగా విశాఖలో(Vishakapatnam) దాదాపు రూ.7కు ఒక్కో గుడ్డును విక్రయిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన గుడ్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి గుడ్లకు డిమాండ్లు రావడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి.

అయితే శీతాకాలంలో ఉడకబెట్టిన గుడ్డును తినడానికి ఆసక్తి చూపుతారు. వైద్యులు కూడా రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినాలని సూచిస్తారు. ఉడకబెట్టిన గుడ్డులో 75 కేలరీలు, ఏడు గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొలెస్ట్రాల్, 1.6 గ్రాముల ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. అయితే ఉడకబెట్టిన గుడ్డును పొట్టు తీసిన వెంటనే తినేయాలని.. అలా కాకుండా పొట్టు తీసిన కొన్ని గంటలకు వరకు దానిని అలాగే ఉంచితే బ్యాక్టిరియా ఫామ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఉడికించిన గుడ్డు పొట్టు తీస్తే.. 2 గంటల్లోపే తినాలని సూచిస్తున్నారు.

Updated On 12 Dec 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story