Pakistan Egg Price : గుడ్లు కొనడానికి గుడ్లు తేలేస్తున్న పాక్ ప్రజలు
పాకిస్తాన్‌లో(Pakistan) ఆర్ధిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు నింగికంటుంతున్న నిత్యావసర ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. మొన్నటి వరకు గోధుమపిండి(Flour) కోసం అల్లాడిపోయిన ప్రజలు ఇప్పుడు కోడి గుడ్డను(Eggs) కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు.
పాకిస్తాన్‌లో(Pakistan) ఆర్ధిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు నింగికంటుంతున్న నిత్యావసర ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. మొన్నటి వరకు గోధుమపిండి(Flour) కోసం అల్లాడిపోయిన ప్రజలు ఇప్పుడు కోడి గుడ్డను(Eggs) కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు. పౌల్ట్రీలో(Poultry) ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర 10, 500 రూపాయలు నుంచి 12, 500 రూపాయలు అయ్యింది. ఆకస్మాత్తుగా పెరిగిన ధర ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. డజన్ గుడ్లను 360 రూపాయలకు అమ్మాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైల్ వ్యాపారులు 389రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్కో గుడ్డు ధర 32 రూపాయలన్నమాట! మన కరెన్సీలో చెప్పాలంటే 10.71 రూపాయలు. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు.