ఉదయాన్నే ఏం తినాలి.. ఏం తింటేమంచిది..? తినకూడనిది ఏంటి.. ఇలా చాలా ఆలోచనలు మనలో ఉంటాయి. అందరు ఏదో ఒకటి చెపుతుంటారు. అయితే అందులో ఏదో ఒకటి నిజం అయ్యి ఉంటుంది కదా.అయితే పగడపున తీసుకునే పదార్ధాలలో యాపిల్ కూడా ఒకటి. దాన్ని జూస్ గా చేసుకుని తీసుకుంటే ఎన్ని ఉపమోగాలు ఉంటాయో తెలుసా..?

మీకు తెలుసా.. రోజుకో ఆపిల్(Apple) ను తినండి.. అసలు హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరమే రాదు. ఆపిల్స్ లో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షస్తాయి. ఆపిల్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దాని రసం(Apple Juice) తాగడం వల్ల కూడా అన్ని ప్రయోజనాలున్నాయి.
ఆపిల్ తినడం ఇష్టం లేకుంటే.. దాని జ్యూస్ తాగడానికైనా ప్రయత్నం చేయండి.. అది మన శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్-సి, పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ అందిస్తుంది. యాపిల్ లో అవి పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ ను తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిందంటేు..?
ఆపిల్ జ్యూస్ ఆస్తమా రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తమా(Asthma) పేషెంట్లు ఈ జ్యూస్ ను రోజూ పరిగడుపున తాగడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునేవారికి ఆపిల్ జ్యూస్ బెస్ట్ డ్రింక్ అనే చెప్పాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆపిల్ జ్యూస్ ను తాగడం మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
యాపిల్ జూస్ పరిగడుపున తాగడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే పెక్టిన్, ఫైబర్ లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. అంతే కాదు ఈ జూస్ తాగడం వల్ల కళ్లు కూడా బాగుపడతాయి.. కంటి చూపు పెరుగుతుంది. అంతే కాదు ఇది జీర్ణ వ్యవస్తను కూడా కాపాడుతుంది.