ఈరోజుల్లో అధిక రక్తపోటు(Blood Pressure) సర్వసాధారణంగా మారింది. చిన్న వయసులతోనే ఈ హైపర్ టెన్షన్ సమస్యను కొని తెచ్చుకుంటున్నారు మన వాళ్లు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి రక్తపోటుకు కారణమవుతుంది. రక్త ప్రసరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు గుండె కష్టపడుతుంది. అధిక రక్తపోటు వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ప్రభావితం చెందుతాయి. ముఖ్యంగా గుండెపై అధిక రక్తపోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

అయితే, ప్రతి రోజూ ఆహారంలో(Daily Food) టమాటా ఉంటే అధిక రక్తపోటును నియంత్రిస్తుందని తాజాగా ఓ అధ్యనం తెలిపింది. టమాలో ఉండే పొటాషియం, లైకోపీన్ కంటెంట్ కారణంగా ప్రతిరోజూ టమాటాలు తినే వ్యక్తుల్లో రక్తపోటును నివారిస్తుందని ఈ స్టడీ తెలిపింది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో(Preventive Cardiology) గత నెలలో ఈ నివేదిక ఇచ్చింది. టమాటాలు అధికరక్తపోటును సమర్థవంతంగా ఎదుర్కొటున్నాయని తెలిపింది. పొటాషియం(Pottasium) పుష్కలంగా ఉండడంతో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుందని తేల్చారు. గుండెకు కూడా ఇది మంచి ఆహారమని చెప్తున్నారు.
తాజా అధ్యయనం చెప్పిన ప్రకారం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 7 వేల మందికిపైగా స్పానిష్ ప్రజలపై పరిశీలనలు జరిపారు. వారి జీవనశైలి, ఆరోగ్యపరిస్థితులను పరిగణలోనికి తీసుకున్నారు. రోజూ టమాట తినేవారిని, టమోటా ఉత్పత్తులను తినేవారిని, టమాటా అసలు తినని వారిని వర్గాలుగా విభజించారు. ఎక్కువ టమాటా తీసుకునేవారిలో అధికరక్తపోటు ప్రమాదం 36శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. మితంగా తీసుకున్నవారిలోనూ రక్తపోటు తగ్గుతుందని తేలింది. టమాటాలో ఆల్ఫా, బీటా, లుటీన్, లైకోపీన్ కెరోటినాయిడ్స్ ఉంటాయి. దీని వల్ల ట్యూమర్లు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టమాటాలో ఎ, సి, ఇ విటమిన్లు ఉండడతో శరీరంలోని వివిధ అవయవాలు సజావుగా పనిచేస్తాయి. అధిక బీపీని నియంత్రించడానికి టమాటా ప్రతిరోజూ తీసుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా టమాటా సహాయపడుతుందని ఈ స్టడీ పేర్కొంది.