Benefits Of Sunflower Seed: పొద్దుతిరుగుడు(sunflowers) పువ్వు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పువ్వు విత్తనాల(seeds) నుంచి కుకింగ్ ఆయిల్ తయారు చేస్తారు. అదే సన్ ఫ్లవర్ ఆయిల్. కానీ నూనె రూపంలో కాకుండా.. ఈ విత్తనాలను కాల్చి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Benefits Of Sunflower Seed: పొద్దుతిరుగుడు(sunflowers) పువ్వు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పువ్వు విత్తనాల(seeds) నుంచి కుకింగ్ ఆయిల్ తయారు చేస్తారు. అదే సన్ ఫ్లవర్ ఆయిల్. కానీ నూనె రూపంలో కాకుండా.. ఈ విత్తనాలను కాల్చి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్ ఒక సూపర్ ఫుడ్. ఇందులో కాల్షియం(calcium), ప్రొటీన్(protine), ఫైబర్(fiber), ఫోలేట్(Pholet), జింక్ ఐరన్(Zinc,Iron) విటమిన్ ఎ, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి. వీటిని కాల్చి తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. పొద్దుతిరుగుడు పువ్వు గింజలను వేయించి తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం ద్వారా ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం, కీళ్లనొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది.
2. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే మెగ్నీషియం మెదడుకు చాలా మేలు చేస్తుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
3. పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఒలీక్, లినోలెయిక్ ఫ్యాటీ యాసిడ్ ఇందులో ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మొత్తం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
4. ఈ విత్తనాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
5. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం మాదిరిగానే గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

Updated On 16 Jun 2023 11:38 PM GMT
Ehatv

Ehatv

Next Story