కూరగాయలన్నీ(vegetables) మనిషి ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా మేలు చేసేవే... ఒక్కొక్క కూరగాయలో ఒక్కో దివ్వ ఔషదం దాగి ఉంటుంది. రకరకాల ఆరోగ్య గుణాలు కలిగి ఉంటాయి. ఇక తాజాగా మనం తాజా బీరకాయలో(Ridge gourd ) ఉండే మంచి గురించి..

కూరగాయలన్నీ(vegetables) మనిషి ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా మేలు చేసేవే... ఒక్కొక్క కూరగాయలో ఒక్కో దివ్వ ఔషదం దాగి ఉంటుంది. రకరకాల ఆరోగ్య గుణాలు కలిగి ఉంటాయి. ఇక తాజాగా మనం తాజా బీరకాయలో(Ridge gourd ) ఉండే మంచి గురించి.. అది చేసే మేలు గురించి తెలుసుకుందాం.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అందుకే ఆరోగ్య నిపుణులు మంచి పోషకాహారాన్ని(Healthy Foods) తినాలని సలహానిస్తుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వీటిలో బీరకాయ ఒకటి. ఆ బీరకాయలు ఎలా ఉపమోగపడతాయి.. వాటిలో ఉండే మంచి గుణాలు ఏంటీ.. చూద్దాం.

బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. బీరకాయను తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది ఎందుకంటే బీరకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా రావు.

బీరకాయ బరువుతగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటే.. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.

బీరకాయలో ఉండే ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Updated On 26 Sep 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story