సమాజంలో అందరూ ఒకేలా ఉండరు...కొంత మంది చప్పటి తిండి తింటారు.. కొంత మంది బాగా కారం తింటారు.. మరికొంత మంది మాత్రం మధ్యస్తంగా తింటారు.. అయితే ఎక్కువ మంది మాత్రం చాలా మంది స్పైసీ ఫుడ్(Spicy food) ను బాగా ఇష్టపడతారు. కానీ రెగ్యులర్ గా ఎండుమిర్చి పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలిస్తే.. భయం వేయకమానదు.

కారం(Spicy) ఎక్కువగా తింటే ముందుగా వచ్చే సమస్య.. కడుపులో అల్సర్లు(Stomach ulcers).. కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రాణాల మీదికి కూడా తెస్తుంది. ఎర్ర మిరపకాయలలో(Red Chilly) అఫ్లాటాక్సిన్(Aflatoxin) ఉంటుంది. ఇది కొన్ని కొన్ని సార్లు కడుపు పూతలు, లివర్ సిర్రోసిస్, పెద్దప్రేగు క్యాన్సర్(Large Intestine Cancer) వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

అంతే కాదు అసలు ఎర్రమిరపకాయల పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయోయ తెలిస్తే... మీకు భయం వేయకమానదు. ప్రస్తుత కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలతో(Gastric Problem) బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర చికాకు కలుగుతుంది. ఇది గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్లకు దారితీస్తుంది.

కారం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల విరేచనాల సమస్య వస్తుంది. ముఖ్యంగా ఎండుమిరపపొడి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) లేదా ఇతర జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. కారంలో ఉండే క్యాప్సైసిన్ మన గొంతు, నోరు, శ్వాసకోశ వ్యవస్థలోని శ్లేష్మ పొరలను చికాకు పెడుతుంది.

అలాగే వాపునకు దారితీస్తుంది. రోజూ మిరపపొడిని అతిగా తీసుకోవడం వల్ల మీకు శ్వాసకోశ సమస్యలు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. సో ఇలా కారం వల్ల కలిగే నష్టాలు తెలుసుకున్నారు కాబట్టి.. జరంత జాగ్రత్తగా ఉండండి.

Updated On 25 Sep 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story