పండ్లు(Fruits) ఆరోగ్యానికి మంచివి. సీజన్ ప్రకారం వచ్చే పండ్లను తినడానికి ప్రయత్నించండి.. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మన శరీరంలో కలిగే డీ హైడ్రేషన్ సమస్యను పండ్లు తీర్చుతాయి. ఉదయాన్నే పండ్లు తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్(Dehydration) ప్రాబ్లమ్ ను తగ్గిస్తుంది.

ఆరేంజ్(Orange) పండ్లలో విటమిన్ సీ(Vitamin C) ఉంటుంది. ఇది ఒంట్లో డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. సీ విటమిన్ మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజు ఉదయాన్నే ఆరేంజ్ తింటు రోగనిరోధక(Immune Power) శక్తి పెరుగుతుంది.
కడుపు ఉబ్బరం(Stomach Floating) తగ్గాలంటే ఉదయాన్నే ఓ అరటిపండు(Banana) తినండి. ఇందులో టాక్సిన్స్ ను తొలగించే శక్తి ఉంది. దాంతో మీకు కడుపులో కలిగే ఇబ్బందులను అరటి తొలగిస్తుంది. వెంటనే శక్తిని ఇస్తుంది.
నేరు పండులో(Apricot) విటమిన్లు.. పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి.. రక్త పోటును(Blood pressure) తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని మలినాల్ని తొలగిస్తుంది. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఉన్న యాపిల్స్ తినడం వల్ల.. మలబద్దకం నివారించబడి.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.