ఒకప్పుడు మన పెద్దవాళ్లు.. రాత్రి త్వరగా తిని పెందలాడే నిద్ర పోయేవారు. ముఖ్యంగా ఏడు.. ఎనిమిది కల్లా తినేసేవారు. అది ఆరోగ్యకరమైన విషయం. కాని రాను రాను మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాల్లో ప్రజలు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తారు. దీని కారణంగా వారు అర్థరాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. దీంతో పాటు అర్థరాత్రి ఆహారం తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంటారు

ఒకప్పుడు మన పెద్దవాళ్లు.. రాత్రి త్వరగా తిని పెందలాడే నిద్ర పోయేవారు. ముఖ్యంగా ఏడు.. ఎనిమిది కల్లా తినేసేవారు. అది ఆరోగ్యకరమైన విషయం. కాని రాను రాను మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాల్లో ప్రజలు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తారు. దీని కారణంగా వారు అర్థరాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. దీంతో పాటు అర్థరాత్రి ఆహారం తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంటారు. కాని ఇప్పుడు పల్లెటూరిలో కూడా ఇలా లేట్ గా తినడం అలవాటు చేసుకుంటున్నారు. దాన్ని ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.

ఇక జీవ్హా చాపల్యం ఉన్నవారు చాలామంది. లేట్ నైట్ తమ తిండి కోరికలను తీర్చుకోవడానికి హోటల్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు. దీని వల్ల చాలా సార్లు శరీరం నష్టపోతుంది. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దీని వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మధుమేహం(Diabetes), అధిక రక్తపోటు(High BP), బరువు పెరగడం(Weight Gain), డిప్రెషన్(Depression), ఒత్తిడి(Stress), నిద్ర సమస్యలు వస్తాయి. అయితే కొంత మందికి ఇలా లేట్ గా తినడం తప్పదు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు.. అయితే ఇలాంటి సమయంలో రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తుంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి. దీని వల్ల ఆహారం వీలైనంత త్వరగా జీర్ణమవుతుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.

అర్థరాత్రి తినడం వల్ల ముందుగా ఏర్పడే అసలైన పెద్ద సమస్య ఎసిడిటీ(Acidity) లేట్ గా తిన్నారో.. అది ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది. దీంతో పాటు కొన్నిసార్లు ఇది ఛాతీలో మంటను కలిగిస్తుంది. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట మొదలైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆలస్యంగా ఆహారం తీసుకోవడం మానుకోండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాబట్టి అర్థరాత్రి పూట ఆహారం తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవాలి. అదే సమయంలో రాత్రి 10 గంటల తర్వాత అస్సలు తినకోవడం మంచిది. . దీని వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. గ్యాస్, అజీర్ణం మొదలైన సమస్యలు ఉండవు

Updated On 17 Aug 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story