కరివేపాకు(Curry Leaves) కూరలో వేస్తాం.. తినేప్పుడు వస్తే.. తీసి పక్కన పెడతాం.. కాని కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) అన్నీఇన్నీ కావు. వాటి గురించి తెలిస్తే.. నిజమా అంటారు. కాని మనలో చాలా మంది కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం. కంచంలో కనిపిస్తే కరివేపాకును తీసిపడేస్తాం. కరివేకాపాకుతో ఉపయోగాలు ఎన్నో తెలుసా...?

కరివేపాకు(Curry Leaves) కూరలో వేస్తాం.. తినేప్పుడు వస్తే.. తీసి పక్కన పెడతాం.. కాని కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) అన్నీఇన్నీ కావు. వాటి గురించి తెలిస్తే.. నిజమా అంటారు. కాని మనలో చాలా మంది కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం. కంచంలో కనిపిస్తే కరివేపాకును తీసిపడేస్తాం. కరివేకాపాకుతో ఉపయోగాలు ఎన్నో తెలుసా...?

క‌రివేపాకు భారతీయుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇండియాలోని దాదాపు ప్ర‌తి కుటుంబం వంటింట్లో దీన్ని ఉప‌యోగిస్తారు. మ‌రి ఇలాంటి క‌రివేపాకు తిన‌టం వ‌ల్ల లాభ‌మా, న‌ష్ట‌మా... ఇందులోని ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు ఏమిటో తెలుసుకుందాం.

డయాబెటిస్(Diabetes), హైపర్‌టెన్షన్(Hypertension) తదితర జీవన శైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణిగా కరివేపాకు ఉపయోగపడుతుంది.కరివేపాకును పొడి చేసి మెంతులు, ఉసిరి, నేరేడు గింజల పొడి, నల్ల జీలకర్ర, తిప్పసత్తు, నాటు కాకర కలిపి పొడి చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక రెండు చెంచాలు కలుపుకొని తినాలి. ఇలా చేస్తే డయాబెటిస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వీరు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది.

మలబద్దకం(Constipation), కడుపులో మంట, కడుపు ఉబ్బరం(Stomach Bloating) తదితర జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణంలా చేసుకొని మజ్జిగలో కలిపి తాగాలి.
కరివేపాకు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాల లభిస్తాయి. ఇవి కాలేయం.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకోసం నిమ్మరసం, కరివేపాకు రసాన్ని లేత చక్కెరతో కలిపి తీసుకోవాలి. వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ప్రతిరోజూ కరివేపాకును తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది

కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కరివేపాకు పరిశోధన ఆకులలో ఉండే టానిన్లు మరియు కార్బజోల్ ఆల్కలాయిడ్స్ యొక్క బలమైన హెపాటో-ప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయని సూచించింది. అలాగే, విటమిన్ ఎ మరియు విటమిన్ సితో కలిపినప్పుడు, దాని అత్యంత శక్తివంతమైన యాంటీ-ఆక్సిడేటివ్ గుణం నిరోధించడమే కాకుండా అవయవాన్ని మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చేస్తుంది.

Updated On 17 Sep 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story