ప్లవరే కదా.. ఏముంటుంది.. ఈ ఒక్కటీ తినకపోతే ఏమౌతుందిలే.. ఇలాంటి మాటలు కాలీప్లవర్(Cauliflower) దగ్గర సాగవు. ఎందుకంటే.. ఈ ఒక్క కూరగాయ తీనడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే మీరు వదిలిపెట్టరుకదా మరి.

Cauliflower Benefits
ప్లవరే కదా.. ఏముంటుంది.. ఈ ఒక్కటీ తినకపోతే ఏమౌతుందిలే.. ఇలాంటి మాటలు కాలీప్లవర్(Cauliflower) దగ్గర సాగవు. ఎందుకంటే.. ఈ ఒక్క కూరగాయ తీనడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే మీరు వదిలిపెట్టరుకదా మరి.
కాలీఫ్లవర్ ని తక్కువ అంచనా వేయకూడదు.. దాంతో ఈ ఫ్లవర్ లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్(Cancer) నిరోధకాలకుగా ఉపయోగపడతాయి. అంతే కాదు వివధ రోగాలను తగ్గించే ఇమ్యూన్ పవర్ ను కూడా కాలీఫ్లవర్ నుంచి అందుతాయి.
కాలీప్లవర్ లో క్యాలరీలతో పాటు.. కార్బో హైడ్రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి.అందుకే బరువు వెంటనే తగ్గాలి(Weight Loss) అనుకునేవారికి ఇదిచాలా ఉపయోగపడుతుంది. డైలీ తమ భోజనంలో కాలీ ప్లవర్ ను తీసుకుంటే.. బరువు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ ఆరోగ్యకరమైన కూరగాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తంలొ కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్ ఎటాక్ లు కూడా.. మనల్ని ఎటాక్ చేయడానికి ఆలోచించాల్సిందే. అంతే కాదు రక్త ప్రసరన సరిగ్గా జరిగే క్రమంలో బీపీలాంటిరోగాలు దరిచేరవు.
ఇక కాలీప్లవర్ లో పోలాషియం ఎక్కువగా ఉంటుంది దాంతో.. ఇది రక్త పోటును నివారించడంలో ఉపగయోగపడుతుంది. అందు వల్ల బీపీలాంటివి దరిచేరకుండా ఉంటాయి.
అంతే కాదు ఇందులో ఫైబర్ ఉంటుందని ముందుగా చెప్పుకున్నాం కదా.. ఈ ఫైబర్ జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. ఇది బలబద్దకం నుంచి రిలీజ్ ఇస్తుంది. పేగులనుక్లీన్ చేస్తుంది. ఇలా చాలా విసయాల్లో కాలీ ప్లవర్ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది.
