చిన్నప్పటి నుంచి పెద్దలు చెపుతుంటారు.. టీవీల్లో చూస్తుంటా.. క్యారెట్(Carrot) మంచిది.. తినండి..పిల్లలకుతినిపించండి.. ఆరోగ్యానికి మంచిది అంటారు కాని.. అసలు క్యారెట్ ఎలా మంచిది.. దాని ఉపయోగాలు ఏంటీ..? చూద్దాం.

చిన్నప్పటి నుంచి పెద్దలు చెపుతుంటారు.. టీవీల్లో చూస్తుంటా.. క్యారెట్(Carrot) మంచిది.. తినండి..పిల్లలకుతినిపించండి.. ఆరోగ్యానికి మంచిది అంటారు కాని.. అసలు క్యారెట్ ఎలా మంచిది.. దాని ఉపయోగాలు ఏంటీ..? చూద్దాం.

క్యారెట్‌లో పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కె1 వంటి ఖనిజాలు , విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కంటి చూపును పదును పెడతాయి. అంతే కాదు శరీరంలోని ఎముకలను కూడా దృఢపరుస్తుంది.

క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు(Hair) పొడిబారకుండా చేస్తుంది. రోజు ఉదయాన్నే క్యారెట్‌ తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. పోటాషియం రక్త నాళాల ధమనుల ఉద్రిక్తతను తగ్గించేందుకు క్యారెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.

క్యారెట్‌లో పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కె1 వంటి ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటును తగ్గించడం, కంటి చూపును పదును పెట్టడం, ప్రోటీన్‌ను పెంచడం, శక్తిని పెంచడం మరియు ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

క్యారెట్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను(Cholestrol) తగ్గిస్తుంది మరియు గుండె సమస్యలను నివారిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులను నివారించడంలో క్యారెట్ ముఖ్యమైన అంశం అని తేలింది. క్యారెట్ రసం దృష్టికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

రీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అనే అణువులు ఉండడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీటి వల్ల క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఫ్రీ ర్యాడికల్స్ అణువులను నాశనం చేయడంతోపాటు, శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతాయి.

క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ మీ దరిచేరదు. ముఖ్యంగా పరగడుపున ఖాళీ కడుపుతో క్యారెట్ తింటే చాలా ప్రయోజనాలున్నాయి.

Updated On 17 Sep 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story