ప్రస్తుతం ప్రజల జీవనశైలి చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలకు వెళ్లేవారు.. స్కూళ్లకు పిల్లలను పంపించేవారు... ఉదయం అల్పహారంగా(Breakfast) బ్రెడ్(Bread) తీసుకుని తమ రోజును ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎక్కువగా బ్రెడ్ తినేందుకు ఇష్టపడుతున్నారు. బ్రెడ్ తేలికపాటి అల్పాహారం అని.. అలాగే అది కడుపులో సులభంగా జీర్ణం అవుతుందని చాలా మంది నమ్మకం.
ప్రస్తుతం ప్రజల జీవనశైలి చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలకు వెళ్లేవారు.. స్కూళ్లకు పిల్లలను పంపించేవారు... ఉదయం అల్పహారంగా(Breakfast) బ్రెడ్(Bread) తీసుకుని తమ రోజును ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎక్కువగా బ్రెడ్ తినేందుకు ఇష్టపడుతున్నారు. బ్రెడ్ తేలికపాటి అల్పాహారం అని.. అలాగే అది కడుపులో సులభంగా జీర్ణం అవుతుందని చాలా మంది నమ్మకం. వైట్ బ్రెడ్(white bread), బ్రౌన్ బ్రెడ్(brown Bread), మిల్క్ బ్రెడ్(Milk Bread) ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మన ఆధునిక జీవనశైలిలో రోజురోజుకూ బ్రెడ్ ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారింది. బ్రెడ్‌లో తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి హాని కలగదని కొందరు నమ్ముతారు కానీ ఇది నిజమేనా? బ్రెడ్ తినడం ఆరోగ్యానికి మంచిదో కాదో ఈ రోజు మనం తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో బ్రెడ్ తీసుకోవచ్చా ?..
ఉదయం బ్రెక్ ఫాస్ట్ గా బ్రెడ్ తీసుకోవడం ఇప్పుడు అందరికి అలవాటుగా మారింది. క్షణాల్లో ఎలాంటి శ్రమ లేకుండానే అల్పహరంగా తీసుకోవచ్చు.. దీంతో దీనిని తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గ్రెయిన్స్ ఫుడ్ ఫౌండేషన్ ప్రకారం బ్రెడ్‌లో ఫోలేట్, ఫైబర్, ఐరన్, బి విటమిన్లు అనేక పోషకాలు ఉన్నాయి. కానీ ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఆరోగ్యానికి హానికరం. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఉదయాన్నే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్ అంటుంటారు డైటీషియన్స్.. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు వస్తాయి.
బ్రెడ్‌లో ఈ పోషకాలు ఉంటాయి..
కేలరీలు: 82
ప్రోటీన్: 4 గ్రాములు
మొత్తం కొవ్వు: 1 గ్రాము
కొవ్వు: 0 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 14 గ్రాములు
ఫైబర్: 2 గ్రాములు
చక్కెర: 1 గ్రాము
ఖాళీ కడుపుతో బ్రెడ్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు..
షుగర్ లెవల్స్(Sugar Level) పెరుగుతాయి..
రోజూ ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల షుగర్ లెవెల్ చాలా పెరుగుతుంది. దీని అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. బ్రెడ్‌లో అమిలోపెక్టిన్ ఎ ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. రోజూ తినడం వల్ల మధుమేహం, మూత్రపిండాల్లో రాళ్లు, గుండె జబ్బులు కూడా వస్తాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను(Waste Cholesterol)పెంచుతుంది..
బ్రెడ్‌లో అరుదుగా ఉండే విటమిన్ ఇ, ఫైబర్ ఉంటుంది.. దీనిని రోజూ తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
బరువు పెరగడం(Weight gain)...
రోజూ బ్రెడ్ తినడం వల్ల శరీర బరువు పెరగుతుంది. అలాగే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా జీవక్రియ రేటు తగ్గుతుంది. ఆ తర్వాత శరీరంలో ప్రోటీన్ , కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారడం ప్రారంభిస్తాయి. బరువు పెరగడం మొదలవడానికి ఇదే కారణం. బరువు పెరగడానికి వైట్ బ్రెడ్ ప్రధాన కారణం.