ప్రతీ సమస్యకు పరిష్కారం మన ఇంట్లో..పెరట్లో ఉండే వస్తువులు,చెట్లు.. మొక్కల నుంచి దొరుకుతుంది. అందులో అరటి పండుతో(Banana) పాటు కూర అరటి వల్ల కూడా ఇలాంటిప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ప్రతీ సమస్యకు పరిష్కారం మన ఇంట్లో..పెరట్లో ఉండే వస్తువులు,చెట్లు.. మొక్కల నుంచి దొరుకుతుంది. అందులో అరటి పండుతో(Banana) పాటు కూర అరటి వల్ల కూడా ఇలాంటిప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
అరటిపండు అందరికీ సులభంగా దొరుకుతుంది. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
రోజూ అరటిపండు తింటే అజీర్తి రాదు. అనారోగ్యము దరిచేరదు.
మలబద్ధకం(Constipation), పురిటి నొప్పులతో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే క్రమంగా వ్యాధి నుంచి బయటపడవచ్చు.
వయసు పెరిగే కొద్దీ అందరి చూపు క్షీణించడం ప్రారంభమవుతుంది. అటువంటి ప్రభావంతో బాధపడేవారు రోజూ ఒక అరటిపండును 21 రోజుల పాటు తింటే, వారి చూపు(Eye Sight) క్రమంగా క్లియర్ అవుతుంది.
పండులా తినేదే కాదు.. కూర అరటికాయతో కూడా అనేక ఉపయోగాలుఉన్నాయి. అరటి కూర వారానికి ఒక్క సారి తింటే శరీరంలో అనేక మార్పులకుఇది కారణం అవుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది.
అరటి పండ్లు శరీరానికి ఎక్కువ క్యాలరీల శక్తిని అందిస్తాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే అరటి పండ్లలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్‌తో కలిసిన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి శరీరానికి అత్యవసర శక్తిని అందిస్తాయి. కండరాల కదలికలకు, తిమ్మిర్లు తగ్గించేందుకు పొటాషియం సహకరిస్తుంది.