ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ (Tea) గొంతులోకి జారనిదే చాలా మందికి తెల్లారినట్లు కాదు. అలా పొద్దున్నే టీ తాగడం ఒక అలవాటుగా(Habit) మారింది. నిత్యం టీ తాగే అలావాటు చాలా మందిలో ఉంది. అయితే ఎక్కువగా ఛాయ్ తాగడం ఆరోగ్యానికి హానికరమని(Unhealthy) వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో లైఫ్ స్టయిల్(Life style) మారడటంతో ఇంట, బయటా మనుషులపై ఒత్తిడి (Stress) అధికంగా ఉంటోంది. శారీరకంగా పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మానిసికంగానూ(Physiological) ఉంటుంది. అయితే టీకి బదులు..చమోమిలే టీని(Chamomile tea) డైట్‎లో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చమోమిలే టీని..చామంతి టీ అని కూడా అంటారు. చామంతి టీ అనేది ఔషధాల(Medicinal) టీ. ఈ టీ తాగడం మంచిదని న్యూట్రిషనిస్టులు(Nutritionist) చెబుతున్నారు.

చామంతి టీతో అద్భుత ప్రయోజనాలుః

చామంతిలోని ఫ్లేవనాయిడ్స్(Flavonoids) ఔషధ గుణాలు ఉంటాయి..చలికాంలో(Winter) ఈ టీ తాగితే హెల్దీగా ఉండొచ్చని అంటున్నారు.

నిద్రలేమితో(Insomnia) బాధపడేవాళ్లు చామంతి టీ తాగాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఎపిజెనిన్(Apigenin) అనే యాంటి ఆక్సిడెంట్ నిద్ర పట్టేలా చేస్తుందట.

ఈ సీజన్‎లో(Season) రోజు వేడివేడి చామంతి టీ తాగితే జలుబు(Cold) నుంచి రిలీఫ్ ఉంటుందంటున్నారు. చామంతి టీ ఆవిరి పట్టినా ముక్కు కారడం, గొంతు నొప్పి (Throat infection)వంటివి తగ్గిపోతాయట.

నెలసరి నొప్పులు(Periods Pain)తగ్గడానికి కూడా చామంతిటీలోని యాంటీ ఇన్‎ఫ్లమేటరీ (Anti-inflammatory)గుణాలు బ్లడ్ షుగర్‎ని(Blood Sugar) తగ్గిస్తాయని చెబుతున్నారు.

అలాగే తక్కువ క్యాలరీలు(Calories) ఉండే ఈ టీని డయాబెటిస్(Diabetes) ఉన్నవాళ్లు కూడా తాగొచ్చని సూచిస్తున్నారు.

దశాబ్దాల క్రితం నుంచి చామంతి పూలను ఆయుర్వేద(Ayurveda) మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చామంతి టీ పలు అనారోగ్య సమస్యలకు చక్కగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చామంతి పూలతో తయారుచేసే టీ మంచి సువాసనతో(Fragrance) పూల రుచిని కలిగి ఉంటుంది.

చామంతి టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు(Side effects) కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అలర్జీ(Allergy) ఉన్నవాళ్లకి ఇది మంచిది కాదు.. అంతేకాదు ఈ టీని రోజుకి ఒకటి కంటే ఎక్కువ సార్లు తాగితే వాంతులు(Vomiting's) అయ్యే అవకాశం ఉంటుందట. గర్భం(Pregnant) దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు(Lactating women), రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ జోలికి పోవద్దని, వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరని చెబుతున్నారు.

Updated On 11 Dec 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story