ఉదయం సాయంత్రం అని లేదు... కొంత మంది తినడాన్ని ఉద్యోగంలా చేస్తుంటారు... టైము పాడు లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తుంటారు. కాని అలా తినడం వల్ల జరిగే పరిణామాలు తెలిస్తే.. తిండి తినడానికే ఆలోచిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే అది తినడం కరెక్టేనా..? అసలు ఎప్పుడు ఏది తినాలి ఉదయం తినేవి ఏంటీ..? రాత్రి తినే పదార్ధాలు ఏంటీ.. ?. ఉదయాన్నె తినకూడని పదార్ధాలుఏమిటి..

ఉదయం సాయంత్రం అని లేదు... కొంత మంది తినడాన్ని ఉద్యోగంలా చేస్తుంటారు... టైము పాడు లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తుంటారు. కాని అలా తినడం వల్ల జరిగే పరిణామాలు తెలిస్తే.. తిండి తినడానికే ఆలోచిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే అది తినడం కరెక్టేనా..? అసలు ఎప్పుడు ఏది తినాలి ఉదయం తినేవి ఏంటీ..? రాత్రి తినే పదార్ధాలు ఏంటీ.. ?. ఉదయాన్నె తినకూడని పదార్ధాలుఏమిటి.. తింటే ఏమౌతుంది.. చూద్దాం..

కొంతమంది ఉదయం లేవగానే మొదట చేసే పని కాఫీ తాగడం. ఇలా బెడ్ దిగక ముందే కాఫీనో, టీనో తాగడం ఏదో కల్చర్ గా ఫీల్ అవుతారు చాలా మంది కాని ఉదయాన్నే ఏమితినకుండా కడుపులోకి ఏమి వెళ్లకముందు కాఫీ కాని టీ కాని తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే హైడ్రో క్లోరిక్ యాసిడ్ అప్పుడు డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతుంది. తద్వారా కడుపులో ఆసిడ్ రియాక్షన్స్ దెబ్బతింటాయి.

ఉదయాన్నే తినకూడని మొదటి పదార్ధం నూనె. నూనెతో చేసిన ఏ ఫుడ్స్ అయినా సరే ఉదయాన్నే ఎక్కువగా తినకూడదు. వాడిన వస్తువులు తీసుకోకూడదు. నూనె లో ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అది త్వరగా ఆకలి పెరగకుండా అడ్డుకుంటుంది. దాంతో లంచ్ టైంలో ఏమి తినాలి అనిపించదు. అందుకే ఉదయాన్నే నూనె లేని ఇడ్లీ లాంటి పదార్ధాలు అల్పాహారంలోకి తీసుకోవడానికి ప్రయత్నించండి.

ఉదయాన్నే స్పైసీ ఫుడ్స్ తినకూడదు. కారంగా ఉండే పదార్ధాలు ఎప్పుడు తీసుకున్న పొట్టకి ఇబ్బందే. మరీ ముఖ్యంగా ఉదయాన్నే స్పైసీ ఆహారం అస్సలు తీసుకోవద్దు. ఇది మీ పేగులను బాధపెడుతుంది. దానితో అల్సర్ లాంటివి వచ్చి కడుపు కరాబు అవుతుంది.

ఇక సాఫ్ట్ డ్రింక్స్, కూడా అంతే.. ఉదయాన్నే తాగే అలవాటు కొంత మందికి ఉంటుంది. అలా ఉదయాన్నే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. ఉదయాన్నేఇలా డ్రింక్స్ తాగడం వలన షుగర్ లెవల్స్ పెరుగుతాయి... ఇంత ఉదయాన్నే షుగర్ అంటించుకోవడం మంచిది కాదు కదా...? అంతేకాకుండా ఇది స్టమక్ బ్లోటింగ్ కి కారణమవుతుంది.

ఉదయాన్నే తీసుకోకూడని వాటిలో బీన్స్ కూడా ఉన్నాయి. ఈ బీన్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెం వస్తుంది. అలాగే ఆల్కొహాల్ ప్రాడక్ట్స్ తో బ్లోటింగ్ తప్పదు. ఉదయాన్నే సిట్రస్ ఫలాలు, టమాట కూడా వద్దు. ఇవి అల్సర్స్ ని మోసుకోస్తాయి.

Updated On 31 March 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story