పానీపూరి (Pani Puri) అంటే మీకున్న ఇష్టాన్ని ఓ మూడు నాలుగు నెలల పాటు చంపేసుకోండి. ఇది హెచ్చరికతో కూడిన ఓ సూచన..వర్షా కాలం అయ్యేంత వరకు పానీపూరికి దూరంగా ఉండటం చాలా మంచిది. మామూలుగా పానీపూరి బండ్ల వద్ద జనం గుమిగూడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఇంకాస్తా ఎక్కువ. చినుకులు పడితే చాలు పానీపూరి కోసం జనాలు ఎగబడతారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గొల్‌గప్పా కనిపిస్తే చాలా నోరూరుతుంటుంది చాలా మందికి!
పానీపూరి (Pani Puri) అంటే మీకున్న ఇష్టాన్ని ఓ మూడు నాలుగు నెలల పాటు చంపేసుకోండి. ఇది హెచ్చరికతో కూడిన ఓ సూచన..వర్షా కాలం అయ్యేంత వరకు పానీపూరికి దూరంగా ఉండటం చాలా మంచిది. మామూలుగా పానీపూరి బండ్ల వద్ద జనం గుమిగూడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఇంకాస్తా ఎక్కువ. చినుకులు పడితే చాలు పానీపూరి కోసం జనాలు ఎగబడతారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గొల్‌గప్పా కనిపిస్తే చాలా నోరూరుతుంటుంది చాలా మందికి! తినేటప్పుడు మాత్రం గప్‌చుప్‌లను ఎలా తయారు చేశారో, ఏ నీళ్లు వాడారో పట్టించుకోము. తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా ఆలోచించము. ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం అనారోగ్యానికి గురి కాక తప్పదని నిపుణులు అంటున్నారు. పానీపూరీలు అమ్మే ప్రదేశం పరిశుభ్రంగా లేకపోయినా, వాటిని తయారు చేసే ప్రాంతం క్లీన్‌గా లేకపోయినా, వాటిని తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్‌ఫెక్షన్లు ఉన్నా .. అవి మనకు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. వర్షాకాలంలో పానీపూరి తినకపోతే ఎలా అంటారా? అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోయినా ప్రమాదమే. సాధారణంగా స్ట్రీట్ వెండర్స్ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇకపోతే పానీపూరీలో పాన్ మసాలాను కలుపుతారు. దానివల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. వాటిల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజూ తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అన్నట్టు ఇది కేవలం పానీపూరికే వర్తించదు.. రోడ్డుపక్కన అమ్మే ఏ ఫుడ్డుకైనా ఇది వర్తిస్తుంది. పరిశుభ్రత పాటించని హోటల్స్‌లో తిన్నా ప్రమాదమే! అంచేత వర్షాకాలం అయ్యేంత వరకు బయట ఫుడ్‌కు దూరంగా ఉండటం బెటర్!