తెలుగు రాష్ట్రాల్లో కొత్త కుంభకోణం(scam) ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రాల్లో కొత్త కుంభకోణం(scam) ప్రారంభమైంది. స్కాం కాదేదీ అనర్హమంటూ గాడిదల పేరుతో స్కాంకు తెరలేపారు కొందరు దుర్మార్గులు.

గాడిదల ఫాం(donkey farm) ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని మమ్మల్ని నమ్మబలికారు. ఒక్కొక్కరు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు.

తమిళనాడు(Tamilnadu) తిరునన్‌వెలికి(Tirunanvelli) చెందిన కొంతమంది ఈ వ్యాపారం గురించి చెప్పడంతో కొందరు గాడిదల ఫాంను పెట్టేందుకు ముందుకు వచ్చారు. గాడిదల ద్వారా వచ్చిన పాలను తామే తీసుకుంటామని తెలిపారు. మొదట్లో కొంత వరకు గాడిద పాలను కొనుగోలు చేశారు. డబ్బులు చెల్లించారు. రానురాను కోటాను కోట్లు బకాయిలు పడ్డారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ కావడంతో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.

Eha Tv

Eha Tv

Next Story