మన దేశంలో బాగా ఇష్ట‌ప‌డి తినే ఫుడ్‌లో మోమో ఒకటి. ఈ స్టీమ్డ్ డిష్‌ను వెజ్, నాన్-వెజ్ రెండింటిలోనూ ఆహార ప్రియులు ఆస్వాదిస్తుంటారు.

మన దేశంలో బాగా ఇష్ట‌ప‌డి తినే ఫుడ్‌లో మోమో ఒకటి. ఈ స్టీమ్డ్ డిష్‌ను వెజ్, నాన్-వెజ్ రెండింటిలోనూ ఆహార ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన మోమో ఫ్యాక్టరీ సంఘటన ఆహార ప్రియులను షాక్‌కు గురిచేసింది. పంజాబ్‌(Punjab)లోని మొహాలిలో మోమో( Mohali Momo), స్ప్రింగ్ రోల్స్ త‌యారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా రిఫ్రిజిరేటర్‌లో కుక్క తల క‌నిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని కూడా గుర్తించారు. సోషల్‌ మీడియాలో ఆ ఫ్యాక్టరీలో అపరిశుభ్రంగా ఉందంటూ కొన్ని వీడియోలు వైరల్‌ కావడంతో అధికారులు ఆకస్మికంగా దానిని తనిఖీలు చేశారు. మాటౌర్ గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ రెండేళ్లుగా చండీగఢ్, పంచకుల, కల్కాకు ప్రతిరోజూ క్వింటాల్‌కు పైగా మోమోలు, స్ప్రింగ్ రోల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద మొత్తంలో చెడిపోయిన మాంసం, క్రషర్ యంత్రం, వాడిన ఆయిల్‌ను గుర్తించారు. కాగా, కుక్క మాంసాన్ని ఆహార ఉత్పత్తులలో ఉపయోగించలేదని, నేపాలీకి ఫ్యాక్టరీ కార్మికులు దీనిని తినేవారని అధికారులు తెలిపారు.

ehatv

ehatv

Next Story