చలి(cold) చంపుకుతింటున్నది. గత కొన్ని రోజులుగా గజగజమని వణికిస్తున్నది. బుధవారం చలి మరింత పెరిగింది. మరో రెండుమూడు రోజులు కనిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperature) ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological center) తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని డిసెంబర్‌ నెలాఖరుకు మళ్లీ చలి పెరుగుతుందని వివరించింది. చలికి తోడు చలిగాలులు(Cool wind) కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతాయని పేర్కొంది.

చలి(cold) చంపుకుతింటున్నది. గత కొన్ని రోజులుగా గజగజమని వణికిస్తున్నది. బుధవారం చలి మరింత పెరిగింది. మరో రెండుమూడు రోజులు కనిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperature) ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological center) తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని డిసెంబర్‌ నెలాఖరుకు మళ్లీ చలి పెరుగుతుందని వివరించింది. చలికి తోడు చలిగాలులు(Cool wind) కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు(Children), వృద్ధుల(Elderly People) విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా దుస్తులు(cloths), ఆహార(Food) విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 12-13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అత్యంత కనిష్ఠంగా 12.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, మెదక్‌లో 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్‌లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్‌లో 16.1, హైదరాబాద్‌లో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 17, మహబూబ్‌నగర్‌లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated On 14 Dec 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story