మన ఆహారంలో(Food) ప్రతి రోజూ పండ్లు(Fruits) ఉండేలా చూసుకోవాలని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు చెప్తుంటారు. పండ్లు తింటే రోగాల బారిన పడకుండా ఉంటామని, శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని చెప్తారు. ఆహారంలో తాజా పళ్లను చేర్చుకోవాలని సూచిస్తారు. అయితే పండ్లే కాదు వాటి వాసన(Smell) కూడా మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
మన ఆహారంలో(Food) ప్రతి రోజూ పండ్లు(Fruits) ఉండేలా చూసుకోవాలని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు చెప్తుంటారు. పండ్లు తింటే రోగాల బారిన పడకుండా ఉంటామని, శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని చెప్తారు. ఆహారంలో తాజా పళ్లను చేర్చుకోవాలని సూచిస్తారు. అయితే పండ్లే కాదు వాటి వాసన(Smell) కూడా మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. పండ్ల వాసన క్యాన్సర్(Cancer) కణాల వృద్ధిని అడ్డుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది. క్యాన్సర్ థెరపీలో హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హిబేటర్‌ను వైద్యులు వాడి క్యాన్సర్ కణాల వృద్ధిని, పార్కిన్సన్, అల్జీమర్స్ మొదలైన వ్యాధులను అరికట్టేలా చేస్తారని వెల్లడించింది. అయితే బాగా పండిన పండ్ల వాసన కూడా హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హిబేటర్ తరహాలో పనిచేస్తుందని వెల్లడించారు.
పండ్ల వాసనను పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు జరుగుతాయని ఇది క్యాన్సర్, నరాల వ్యాధి చికిత్సకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత అధ్యయనం చేయాలని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆవిర్లు, వాసనలకు వంటి విధానాలు క్యాన్సర్ కణాలపై ఏ మేరకు పనిచేస్తాయో చూడాల్సి ఉందని సైంటిస్టులు చెప్పారు. ఎలుకలు, జంతువులపై ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మనుషుల్లోని అవయవాలకు వ్యాపించే క్యాన్సర్ కణాలకు సంబంధించిన ఈ పరిశోధనలు వైద్య చికిత్సలో కీలకం కానున్నాయని చెప్తున్నారు.