తులసి(Basil) ప్రకృతిలోని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఒకటి. అటు ఆయుర్వేధపరంగా, ఇటు సైంటిఫిక్ గా.. తులసి గొప్పతనం నిరూపించబడింది. ఈ తులసికి రాగి పాత్ర తోడైతే.. ఆరోగ్యం మీ వెంట ఉన్నట్టే అని గుర్తు పెట్టుకోండి.
తులసి(Basil) ప్రకృతిలోని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఒకటి. అటు ఆయుర్వేధపరంగా, ఇటు సైంటిఫిక్ గా.. తులసి గొప్పతనం నిరూపించబడింది. ఈ తులసికి రాగి పాత్ర తోడైతే.. ఆరోగ్యం మీ వెంట ఉన్నట్టే అని గుర్తు పెట్టుకోండి.
తులసి ఈ మొక్కలోని అన్ని భాగాలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఒకప్పుడు అందరి ఇళ్లలో ఈ మొక్క ఉండేదంటే నేడు ఈ మొక్క ఉన్న ఇళ్ల సంఖ్య చాలా తక్కువ. ఏ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో తులసి ఉంటే.. తులసి ఆకులను తీసుకుంటూ ఉన్నారంటే.. ఏ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. అవి మీ దరిదాపుల్లోకి కూడా రావు.
ఇక తులసినీరు రాగి పాత్ర(Copper vessel) కాంబినేషన్ గురించి చూస్తే.. ఒక శుభ్రమైన రాగి పాత్రను తీసుకుని అందులో కొంత శుభ్రమైన నీళ్ళు పోసి, గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఆ నీటిలో వేయండి. రాత్రి పడుకునే ముందు ఇలా వేసి.. ఉదయాన్నేఖాళీ కడుపుతో(Empty stomach) ఈ నీరు తాగండి... ఇది అమృత సమానం.
ఇలా 48 రోజులు సేవిస్తే. ఇది 448 వ్యాధులను నయం చేయడంతో పాటు చర్మం ముడతలు కూడా వదిలిస్తుంది. నరాలను బలపరుస్తుంది మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది, అంటే మనం ఎప్పటికీ యవ్వనంగా జీవించగలము.
అలాగే ఈ తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని ఏ భాగమైనా క్యాన్సర్‌ని నయం చేయవచ్చు అంటున్నారు ఆయుర్వేధ నిపుణులు. అంతే కాదు తులసి నీరు ఇలా తాగడం వల్ల నోటి దుర్వాసనను దూరం అవుతుంద. శరీరానికి తులసి యాంటీ సెప్టిక్‌గా ఉపయోగపడుతుంది.
తులసి ఆకులను నానబెట్టిన నీటిని నిరంతరం సిప్ చేయడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది. శరీరంలోని చెమట వాసన పోవాలంటే ముందు రోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని తులసి ఆకులను కలుపుకుంటే వాసన పోతుంది. తులసి ఆకులు చాలా రోజులుగా ఉన్న చర్మపు దద్దుర్లు కూడా నయం చేస్తాయి.
తులసి ఆకులను నిమ్మరసంతో గ్రైండ్ చేసి ఆ పేస్టును చర్మానికి పట్టిస్తే సోరియాసిస్ పోతుంది. అంతే కాదు మూత్ర సంబంధిత రుగ్మతలు ఉన్నవారు తులసి గింజలను బాగా గ్రైండ్ చేసి.. తిని సరిపడా నీరు తాగితే సమస్య తీరుతుంది. అయితే తులసిని కూడా అధికంగా తీసుకోకండి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.