ఇంట్లో చాలా మంది మహిళలు వండగదిలో మిగిలిపోయిన ఆహారం..బయట చెడిపోతుంది అనుకున్నవి వెంటనే ప్రిడ్జ్(Fridge) లో కుక్కేస్తుంటారు. ఆహార పదార్థాలు పాడవకుండా, నిల్వ ఉంటాయన్న ఉద్దేశ్యంతో చీటికీమాటికీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కనిపించిన ప్రతి పదార్థాలను, ఆహారాలను ప్రిడ్జిలో పెట్టడం అంత మంచిది కాదు. అలా చేస్తే చాలా అనర్ధాలు వస్తాయి అంటున్నారు ఆహార నిపుణులు. మరి ప్రిడ్జిలో పెట్టకూడనివి ఏంటి..?

ఇంట్లో చాలా మంది మహిళలు వండగదిలో మిగిలిపోయిన ఆహారం..బయట చెడిపోతుంది అనుకున్నవి వెంటనే ప్రిడ్జ్(Fridge)లో కుక్కేస్తుంటారు. ఆహార పదార్థాలు పాడవకుండా, నిల్వ ఉంటాయన్న ఉద్దేశ్యంతో చీటికీమాటికీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కనిపించిన ప్రతి పదార్థాలను, ఆహారాలను ప్రిడ్జిలో పెట్టడం అంత మంచిది కాదు. అలా చేస్తే చాలా అనర్ధాలు వస్తాయి అంటున్నారు ఆహార నిపుణులు. మరి ప్రిడ్జిలో పెట్టకూడనివి ఏంటి..?

అస్సలు ప్రిడ్జిలో పెట్టకూడని పదార్ధాలు పెడితే.. ఆ పదార్ధాల ఫ్లేవర్ మారిపోవడంతోపాటు న్యూట్రీషన్స్ తగ్గిపోతాయట. అంతే కాదు కొన్ని రకాల పదార్థాలు విషంగా మారి ఫుడ్ పాయిజనింగ్‌(Food poisoning)కి కూడా కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు . అంతే కాదు ప్రిడ్జిల్ లో పెట్టడం మూలంగా చెడిపోయే ప్రమాదం ఉన్న పదార్ధాులు కూడా లేకపోలేదు. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తేనె(Honey) ఎన్ని సంవత్సరాలైన పాడైపోని ఆహార పదార్థం. ఇది బయట ఎన్ని ఏళ్లయినా.. పాడవకుండా ఉంటుంది. అయితే దీన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెడతారు కొందరు. ఇలా చేయడం వల్ల తేనె రుచి మారడమే కాక ఏకంగా గడ్డ కట్టేసే ప్రమాదముంది. అలా గడ్డ కట్టడం దాని సహజత్వానికి విరుద్ధం. ఫలితంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

ఇక ఎక్కువ కాలం బయట ఉంచినా నిలువ ఉండే ..బంగాళాదుంపల(Potato)ను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం పెరిగిపోతుంది. ఫలితంగా త్వరగా షుగర్ వ్యాధి దరిచేరుతుంది. అంతే కాదు.. కిడ్నీల సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది. ప్రిడ్జ్ లో పెట్టి వండిన దుంపలల్లో అధిక చక్కెర వల్ల కూరలో టేస్ట్‌ కూడా మారుతుంది.

ఇక చాలా మంది చేసే పెద్ద పోరపాటు ఏంటంటే..ఉల్లిపాయలు(Onions)ఎక్కువగా కోసి.. నైట్ అంతా ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచుతారు. కాని అది చాలా డేంజర్. అవసరానికి మించి ఉల్లిపాయలను కట్ చేయడం.. ఆపై వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేయడం అసలు మంచిది కాదు. ఇంకా ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలపైన కూడా ప్రభావం ఉంటుంది.

టమెటాల(Tomato)ను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల టేస్ట్‌ మారిపోతుంది. ఇంకా అధికంగా చల్లబడిపోయి వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతాయి. అంతే కాదు నిత్యం మనం వాడుకునే వెల్లుల్లిపాయలు కూడా ఫ్రిజ్‌ ఉంటే కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి.

అరటి పండ్ల(Banana)ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వాటిలోని ఎంజైమ్స్ కరిగిపోయి ఆనారోగ్యానికి దారి తీస్తాయి. వీటితో పాటు.. కట్ చేసి..సేఫ్టీ లేకుండా ఏ పండును కూడా సంగంగా చేసి ప్రిడ్జ్ లో పెట్టకూడదు.

పచ్చళ్లు(pickles): పచ్చళ్లను తడి చేతులతో పట్టుకుంటే పాడైపోయినట్లుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కూడా చల్లదనానికి త్వరగా చెడిపోతాయి.అంతే కాదు మరీ ముఖ్యంగా.. ఉడికించిన గుడ్లు(Eggs)ను ఫ్రిడ్జ్‌లో పెట్టడం కూడా మంచిది కాదు. అలా పెట్టడం వల్ల పెద్దగా అయ్యి, చీలికలు ఏర్పడి లోపల బ్యాక్టీరియాకు కారణమవుతుంది. కాబట్టి గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టకండి.

Updated On 1 May 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story