కిమ్ జాంగ్ ఉన్ రోజువారీ ఆహారం గురించి ఖచ్చితమైన వివరాలు బయటి ప్రపంచానికి స్పష్టంగా తెలియదు..

కిమ్ జాంగ్ ఉన్ రోజువారీ ఆహారం గురించి ఖచ్చితమైన వివరాలు బయటి ప్రపంచానికి స్పష్టంగా తెలియదు.. ఎందుకంటే ఉత్తర కొరియా మూసివేసిన దేశం. అతని వ్యక్తిగత జీవితం గురించి సమాచారం దొరకదు. అయితే, అతని మాజీ వంటవాడు కెంజీ ఫుజిమోటో వంటి వాళ్ల సమాచారం ఆధారంగా కొన్నివిషయాలు బయటకు వచ్చాయి. కిమ్ జాంగ్ ఉన్ రోజూ తినే ఆహారం సాధారణంగా లగ్జరీ, ఖరీదైన వంటకాలతో నిండి ఉంటుందని చెబుతారు. అతను స్విస్ చీజ్, కోబె స్టీక్స్ (ప్రపంచంలో అత్యంత ఖరీదైన బీఫ్), షార్క్ ఫిన్ సూప్, ఫ్రెంచ్ వైన్ (క్రిస్టల్ షాంపైన్ వంటివి), హై-ఎండ్ స్పిరిట్స్ హెన్నెస్సీ కాగ్నాక్, స్కాచ్ విస్కీ లాంటి వాటిని ఇష్టపడతాడని సమాచారం. అతను బ్రెజిలియన్ కాఫీ, ఇటాలియన్ పార్మా హామ్, సుషీ వంటి ఆహారాలను కూడా ఇష్టడతాడని తెలుస్తోంది. ఒకసారి అతని కోసం పిజ్జా తయారు చేయడానికి ఇటలీ నుంచి ఒక చెఫ్‌ను కూడా తీసుకొచ్చారని చెబుతారు. ఉత్తర కొరియాలో సామాన్య ప్రజలు ఆహార కొరతతో బాధపడుతుంటే, కిమ్ మాత్రం ఈ విలాసవంతమైన ఆహారాలను ఆస్వాదిస్తాడని విమర్శలు కూడా ఉన్నాయి.
