తెల్లవారుజామున లేవగానే టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంత కలిగిస్తుంది కూడా. కానీ కొందరికి మాత్రం టీతోపాటు బిస్కెట్ ఉండాల్సిందే. కానీ ఖాలీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ వస్తుందని మరికొందరు బిస్కెట్స్ తీసుకుంటారు.
Disadvantages of eating biscuits with tea : చాయ్(Tea) లవర్స్.. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మనదగ్గరే ఎక్కువగా ఉన్నారు తెలుసా. ఉదయం లేవగానే కప్పు టీ ఉండాల్సిందే. తెల్లవారుజామున లేవగానే టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంత కలిగిస్తుంది కూడా. కానీ కొందరికి మాత్రం టీతోపాటు బిస్కెట్ ఉండాల్సిందే. కానీ ఖాలీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ వస్తుందని మరికొందరు బిస్కెట్స్ తీసుకుంటారు. రోజులో చాలాసార్లు ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు. అయితే ఇటీవల ప్రభుత్వ అధికారిక సమావేశాలలో టీతో బిస్కెట్లు ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమావేశాల్లో కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం వల్ల అధికారులు, ఉద్యోగుల్లో రోగనిరోధక శక్తి మెరుగవడంతో పాటు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు అదుపులో ఉంటాయని పేర్కొంది. నిజమే.. టీతో బిస్కెట్స్ తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్స్(Biscuits) తయారీకి శుద్ధి చేసిన పిండి, హైడ్రోజన్(Hydrogen) కొవ్వులు ఉపయోగిస్తున్నారు. దీంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు మొదలవుతున్నాయి. అందుకే టీ తాగేటప్పుడు బిస్కెట్స్ తీసుకునే అలవాటు మానుకోవలాని లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయనిపోషకాహార నిపుణులు తెలిపారు.
టీతోపాటు బిస్కెట్స్ తీసుకుంటే వచ్చే సమస్యలు..
మధుమేహం పెరుగుతుంది..
ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా, శరీరంలో ఇన్సులిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఇక బిస్కెట్ల షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాటికి ఎమల్సిఫైయర్స్, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ వంటి రసాయనాలు కలుపుతారు. అలాగే అందులో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెరిగేలా చేస్తాయి.అలాగే రక్తంలో ఇన్సులిన్ ఒత్తిడి కూడా పెరుగుతుంది.
ముఖంపై ముడతలు(wrinkles)..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతల సమస్య వస్తుంది. ఇందుకు టీ, బిస్కెట్స్ కలిపి తీసుకోవడం కూడా ఒక కారణమే. ఎందుకంటే బిస్కెట్లలో ఉండే రిఫైన్డ్ షుగర్లో ఎలాంటి పోషక విలువలు ఉండవు. దీని వల్ల చర్మంపై త్వరగా ముడతలు వస్తాయి. దీని కోసం మనం కొవ్వు పదార్థాలను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ముడతల సమస్య తీరడమే కాకుండా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు పెరగడం(Weight Gain)..
అధిక కేలరీలు , హైడ్రోజనేటెడ్ కొవ్వు బిస్కెట్లలో అధికంగా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. సగటున ఒక బిస్కెట్‌లో 40 కేలరీలు ఉంటాయి. అలాగే క్రీములు లేదా తాజాగా కాల్చిన బిస్కెట్లలో 100-150 కేలరీలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో కలిపిన పిండి బరువును వేగంగా పెంచుతుంది.
దంతాల పాడవడం(Tooth Loss)..
టీ, బిస్కెట్స్ కలిపి తీసుకోవడం వలన దంతాలు పాడవుతాయి. టీ, బిస్కెట్లు రెండింటిలో ఉండే సుక్రోజ్ దంతాలను దెబ్బతీస్తుంది. దీంతో పళ్ళు త్వరగా పాడవడం.. దంతాలలో రంధ్రాలు, నోటిలో బ్యాక్టీరియా వంటి అనేక వ్యాధులు వస్తాయి. దీంతో దంతాలలో నొప్పి, దంతాల రంగు మారడం, వాటిపై మచ్చలు మొదలైన సమస్యలు వేధిస్తాయి.