తెలంగాణలో నిత్యావసర వస్తువుల(Basic needs) ధరలపై పౌరసరఫరాలశాఖ(Department of Civil Supplies) సమీక్షించగా.. ఏడాదిలో భారీగా ఈ ధరలు పెరిగినట్లు తేలింది. కంది పప్పు(Dal) 50 శాతం పెరిగింది. బియ్యం(Rice) ధర 13-25 శాతం వరకు పెరిగింది.
తెలంగాణలో నిత్యావసర వస్తువుల(Basic needs) ధరలపై పౌరసరఫరాలశాఖ(Department of Civil Supplies) సమీక్షించగా.. ఏడాదిలో భారీగా ఈ ధరలు పెరిగినట్లు తేలింది. కంది పప్పు(Dal) 50 శాతం పెరిగింది. బియ్యం(Rice) ధర 13-25 శాతం వరకు పెరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో కందిపప్పు రూ.105 ఉండగా అది ప్రస్తుతం రూ.158కి చేరింది. కిలో ఉల్లి(Onion) గతేడాది రూ.27 ఉండగా ఈ ఏడాది డిసెంబర్‌లో దాదాపు కిలో ఉల్లి 47 రూపాయలకు చేరింది. నూనె, మిర్చి ధర కాస్త తగ్గాయని తేలింది. మరోవైపు కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల పెరుగడంతో తమపై అధిక భారం పడుతుందని సామాన్య ప్రజలు చెప్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని పౌరసరఫరాలశాఖ విశ్లేషించింది.