మారుతున్న నేటి జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను(Fitness) కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న ప‌ని. ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో ర‌కాల ప‌దార్ధాల‌ను తినాలని సూచిస్తున్నారు డాక్ట‌ర్లు. అలాంటి వాటిలోనే ఆరోగ్యానికి నిధిగా భావించే ఖర్జూర‌(Date) కూడా ఉంది. ఖర్జూరాని ఉదయం లేదా సాయంత్రం అల్పాహారంలో(breakfast) తింటే అనేక వ్యాధులు నయం అవుతాయి. ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఖర్జూరలో తగినంత పరిమాణంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది.

మారుతున్న నేటి జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను(Fitness) కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న ప‌ని. ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో ర‌కాల ప‌దార్ధాల‌ను తినాలని సూచిస్తున్నారు డాక్ట‌ర్లు. అలాంటి వాటిలోనే ఆరోగ్యానికి నిధిగా భావించే ఖర్జూర‌(Date) కూడా ఉంది. ఖర్జూరాని ఉదయం లేదా సాయంత్రం అల్పాహారంలో(breakfast) తింటే అనేక వ్యాధులు నయం అవుతాయి. ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఖర్జూరలో తగినంత పరిమాణంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఎముకలకు(Bones) మేలు..

పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఎముకలను బలపరుస్తాయి. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన బలహీనమైన ఎముకలకు ఉపయోగపడుతుంది. సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఒత్తిడి(Stress) నుండి ఉపశమనం..

మీరు ప్రతిరోజూ కొన్ని ఖర్జూరాలను తీసుకుంటే.. మీకు విటమిన్ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఇవి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచడంలో సహాయపడతాయి. మీరు దీన్ని మీ ఆహారంలో అల్పాహారంగా చేర్చుకోవచ్చు.

జీర్ణక్రియకు(Digestive system) ప్రయోజనకరం

మీరు జీర్ణ సమస్యలతో బాధపడితే ఖర్జూర మీకు దివ్యౌషధం. ఇందుకోసం కొన్ని ఖర్జూరాలను నీళ్లలో కాసేపు నానబెట్టి తర్వాత తినాలి. రోజూ ఖర్జూరం తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

బరువు(Weight Loss) తగ్గడానికి..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు రోజూ 4-6 ఖర్జూరాలు తింటే.. అది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని ఉదయం అల్పాహారంగా తినవచ్చు లేదా గ్రీన్ టీతో సాయంత్రం స్నాక్స్‌లో చేర్చుకోవచ్చు. ఇది జంక్ ఫుడ్స్ తినాలనే కోరికను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మానికి..(Skin)

విటమిన్-సి, విటమిన్-డి వంటి పోషకాలు ఖర్జూరలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఖర్జూర తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

డయాబెటిక్(Diabetes) రోగులకు మేలు..

ఖర్జూరలో ఉండే పీచు మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలని నిపుణులు సూచించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణ పెరుగులో ఖర్జూరం కలిపి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Updated On 5 Sep 2023 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story