తమ జీవన శైలి ఆధారంగా చాలా మంది మలబద్ధకాన్ని(Constipation) కొని తెచ్చుకుంటున్నారు. ఇది ముదిరితే చాలా ప్రమాదకరమని అంటున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లతో(Food habits) మలబద్ధకం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య రంగనిపుణులు. ఇందుకు రోజూ ఒక టీ స్పూన్ అవిశె గింజలు(Flax seeds) చాలని చెప్తున్నారు. వారంలో మూడు సార్లకంటే తక్కువగా మల విసర్జన చేస్తే మలబద్దకం ఉన్నట్లే.

Flax Seeds Benefits
తమ జీవన శైలి ఆధారంగా చాలా మంది మలబద్ధకాన్ని(Constipation) కొని తెచ్చుకుంటున్నారు. ఇది ముదిరితే చాలా ప్రమాదకరమని అంటున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లతో(Food habits) మలబద్ధకం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య రంగనిపుణులు. ఇందుకు రోజూ ఒక టీ స్పూన్ అవిశె గింజలు(Flax seeds) చాలని చెప్తున్నారు. వారంలో మూడు సార్లకంటే తక్కువగా మల విసర్జన చేస్తే మలబద్దకం ఉన్నట్లే. మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్ తింటే ఈ సమస్యకు గురయ్యే అవకాశముంది. శారీరక శ్రమ(Physical strain) లేకపోయినా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం సమస్య రాను, రాను ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యలను సంప్రదించాలని చెప్తున్నారు. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్లాక్స్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అవిశె గింజల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు జీర్ణక్రియకు(Digestion) మెరుగుపరుస్తాయి. అవిశె గింజలు తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫ్లక్స్ సీడ్స్ తీసుకుంటే కేవలం 12-24 గంటల్లోపే శుభ్రమైపోతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు రోజూ 1 స్పూన్ ఫ్లక్స్ సీడ్స్‌ను తీసుకోవల్సి ఉంటుంది. దీనివల్ల మనిషి శరీరానికి కావల్సిన ఫైబర్ లభిస్తుంది.
వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని చెప్తున్నారు.
