చాలా మందికి పొద్దుపొద్దున ఓ కప్పు కాఫీ(Coffee) లాగించడంతో దినచర్య మొదలవుతుంది. భోంచేసేటప్పటికీ రెండు మూడు కప్పులు తాగేవాళ్లు కూడా ఉన్నారు. కాఫీకి అంతటి మహత్తు ఉంది మరి! అందుకే కాఫీ క్లబ్‌లు తామరతంపరగా వెలుస్తున్నాయి. అక్కడికి వెళ్లి తాగడానికి జేబు కాసింత బరువుగా ఉండాలి. అద్సరేగానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పేరు సివెట్‌(Civet Coffee).. దీన్నే కోపి లుకాక్‌(Kopi Lukac) అని కూడా అంటారు.

చాలా మందికి పొద్దుపొద్దున ఓ కప్పు కాఫీ(Coffee) లాగించడంతో దినచర్య మొదలవుతుంది. భోంచేసేటప్పటికీ రెండు మూడు కప్పులు తాగేవాళ్లు కూడా ఉన్నారు. కాఫీకి అంతటి మహత్తు ఉంది మరి! అందుకే కాఫీ క్లబ్‌లు తామరతంపరగా వెలుస్తున్నాయి. అక్కడికి వెళ్లి తాగడానికి జేబు కాసింత బరువుగా ఉండాలి. అద్సరేగానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పేరు సివెట్‌(Civet Coffee).. దీన్నే కోపి లుకాక్‌(Kopi Lukac) అని కూడా అంటారు. రేటొచ్చేసి కిలో పాతిక వేల రూపాయలకు పైగానే ఉంటుంది. కాకపోతే దీన్ని తయారు చేసే పద్దతి తెలిస్తే మాత్రం డోక్కుంటారు. ఆ కాఫీని కొనడానికి జంకుతారు. కానీ అలా తయారుచేయడం వల్లే కాఫీకి అంతటి రుచి అంటారు మేకర్స్‌. పైగా ఆ కాఫీకి చచ్చేంత డిమాండ్‌ ఉండటానికి కారణం కూడా అదేనట! ఇండోనేషియా(Indonesia), సుమత్రా, జావా, బాలిలలో కోపి లువాక్‌ దొరుకుతుంది.కాఫీ చెర్రీస్‌ అనే పండ్ల నుంచి ఈ కాఫీని తయారు చేస్తారు. అయితే ఆ పండ్ల నుంచే నేరుగా కాఫీ పౌడర్‌ తయారు చేయరు. కాఫీ చెర్రీలను పునుగుపిల్లి చాలా ఇష్టంగా తింటుంది. దీన్నే ఇంగ్లీషులో సివెట్‌ అని పిలుస్తారు. పునుగుపిల్లి చక్కగా చెర్రీలను తినేసి కాసేపయ్యక వాటిని విసర్జిస్తుంది. అది విసర్జించిన గింజలను సేకరించి, కాఫీని తయారు చేస్తారు ఉత్పత్తిదారులు. నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని సివెట్‌ తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్‌లు గింజల నేచర్‌ను మారుస్తాయి. వాటి చేదు గుణాన్ని తగ్గించి రుచిగా మారుస్తాయి. ఈ సహజ జీర్ణ ప్రక్రియే కోలి లువాక్‌ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. పునుగుపిల్లి తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలను విసర్జిస్తాయి. అంటే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందన్నమాట! అందుకే వాటికి అంత డిమాండ్‌.

Updated On 6 Sep 2023 5:46 AM GMT
Ehatv

Ehatv

Next Story