మనం ఆరోగ్యంగా(health) ఉండేందుకు పోషకాలు(Nutrition) అధికంగా ఆహారాన్ని తింటుంటాం.

మనం ఆరోగ్యంగా(health) ఉండేందుకు పోషకాలు(Nutrition) అధికంగా ఆహారాన్ని తింటుంటాం. మారుతున్న జీవనశైలి, ఇతరత్రా అలవాట్ల వల్ల అనారోగ్యం పాలవుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం శారీరక శ్రమ, సమతుల్యత కలిగిన ఆహారం(Food) తీసుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. మనకు పోషకాలు అందించే ఆహారంలో ముఖ్యపాత్ర పోషించేది తవుడు కూడా ఉంది. తవుడులో(Bran) మటన్(Mutton), చికెన్‌(chicken) కంటే ఎక్కువ పోషకాలున్నాయని చెప్తున్నారు. 100 గ్రాముల తవుడును తింటే 316 క్యాలరీల శక్తి వస్తుంది. చికెన్, మటన్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలుంటాయి. అవును జంతువులకు పెట్టే తవుడు మనుషులను తినమనడమేంది అనుకుంటున్నారా.. అవును నిజమే.. తవుడు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. 100 గ్రాముల తవుడులో 14 గ్రాముల ప్రొటీన్, 50 గ్రాముల కార్పొహైడ్రేట్స్, 21 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. తెల్లగా మల్లెపూల వలె మెరిసే బియ్యంలో అసలు ఫైబర్‌ ఉండదు. 100 గ్రాముల తవుడులో 1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 1485 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. మెగ్నిషియం 781 మిల్లీ గ్రాములు, జింక్ 8 మిల్లీ గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది.

అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా తవుడులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఆహారంలో క్రమం తప్పకుండా తవుడును చేర్చుకోవాలని సూచిస్తున్నారు. పేగుల శుభ్రతకు, పేగులలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు, మలబద్ధకం నివారణకు ఇది సహాయపడుతుంది. తవుడులో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత నుంచి బయటపడొచ్చు. రక్తహీనత ఉన్నవారు ఐరన్ ట్యాబ్లెట్‌కు బదులు తవుడును ఆహారంగా తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. ఎముకల దృఢత్వానికి అవసరమైన క్యాల్షియం కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న తవుడును ప్రతి నిత్యం ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 25 Oct 2024 2:30 PM GMT
Eha Tv

Eha Tv

Next Story