గోధుమ పిండిని(Wheat Flour) శుద్ధి చేసి మైదా తయారు చేస్తారు. మైదాలో ఎలాంటి పోషకాలు ఉండవు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. గోధమ పిండిలో ఫైబర్(Fibers), విటమిన్లు(Vitamins), ఐరన్‌(Iron), మెగ్నీషియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. రిఫైన్‌ చేసిన పిండిలో ఈ పోషకాలు ఉండవు, ఫైబర్‌ కంటెంట్‌ కూడా సున్నా ఉంటుంది.

ప్రస్తుం ఉరకులు పరుగుల రోజుల్లో.. మైదా వాడకం ఎక్కువైంది. ఇన్ స్టాంట్ గా చేసే తిను బండారాల్లో(Food Items) మైదా(Refined Flour) అనేది ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది.. మార్కెట్లో ఏ ఆహార పదార్థాలు కొనాలన్నా.. మైదా పిండిలేనిది ఉండట్లేదు. బిస్కెట్లు, బ్రెడ్డు, పఫ్‌లు, రోల్స్‌, పిజ్జా, బర్గర్‌, మంచూరియా, సమోసా ఇలా ఏది చూసినా మైదాతోనే తయారు చేస్తుంటారు.

గోధుమ పిండిని(Wheat Flour) శుద్ధి చేసి మైదా తయారు చేస్తారు. మైదాలో ఎలాంటి పోషకాలు ఉండవు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. గోధమ పిండిలో ఫైబర్(Fibers), విటమిన్లు(Vitamins), ఐరన్‌(Iron), మెగ్నీషియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. రిఫైన్‌ చేసిన పిండిలో ఈ పోషకాలు ఉండవు, ఫైబర్‌ కంటెంట్‌ కూడా సున్నా ఉంటుంది. మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే.. అనారోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

మైదాలో అలోక్సాన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి డయాబెటిస్‌ను ప్రేరేపిస్తుంది. మైదా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను ఎక్కువగా విడుదల చేస్తుంది, ఇన్సులిన్‌ను మరింత పెంచుతుంది. మైదాని ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలున్నాయి.

ఇక శరీరంలో షుగరు లెవల్స్‌ని మైదా అమాంతంగా పెంచేస్తుందిమెదాతో తయారు చేసిన ఆహారాలు తింటే.. త్వరగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మైదా మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచదు, ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది, మీరు ఆహారం ఎక్కువగా తినేలా ప్రోత్సహిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు, ఊబకాయానికి దారితీస్తుంది.

మైదాను గట్‌ జిగురు అని పిలుస్తుంటారు, దీనిలో ఫైబర్‌ కంటెంట్‌ ఉండదు. ఇది జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తుంది. మైదా ఎక్కువగా తినేవారు ఒత్తిడి, మలబద్ధకం వంటి సమస్యలను దారితీస్తుంది. ఇలా మైదా వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి అందుకే మైదాతో కాస్త జాగ్రత్తగా ఉండండి మరి.

Updated On 9 Aug 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story