షుగర్‌ వ్యాధి ఈరోజుల్లో సర్వసాధారణమైంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు షుగర్(Diabetes) బారిన పడుతూనే ఉన్నాం. మారుతున్న జీవణ శైలిలో.. ఒత్తిడి జీవితం మనిషిని చాలా చిన్నవయస్సులోనే రోగాలబారిన పడేస్తుంది. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం చాలా త్వరగా పాడైపోతుంది. గతంలో జీవన విధానం కారణంగానే 80 ఏళ్లు దాటినా.. షుగర్, బీపీలు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు మూడు పదుల వయస్సు దాటితేనే అనేక రుగ్మతలు శరీరాన్ని ఇబ్బందిపెడుతున్నాయి.

అయితే షుగర్‌ వచ్చినవారు, రానివారకు కూడా వారంలో మూడు సార్లు ఆహారంలో ఈ కూర తింటే షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. 'మెంతి కూర'(Fenugreek Curry) వారంలో మూడు సార్లు ఆహారంలో తీసుకుంటే షుగర్‌ వ్యాధిని అరికట్టొచ్చని చెప్తున్నారు. దీంతో కచ్చితంగా హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ మెంతి కూర చాలా పవర్‌ ఫుల్‌ ఆకు కూర అని చెప్తున్నారు. డయాబెటిస్ ఉండి ఒబెసిటీస్‌(Obesity) ఉన్నవారు కూడా ఈ మెంతి కూరను వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు. మెంతి కూరలో ఐరన్‌ రిచ్‌ అధికంగా ఉండడం వల్ల చక్కెర వ్యాధిని అరికడుతుంది.

అంతే కాకుండా ఇంట్లో ఉన్న స్పైసెస్‌ కూడా డయాబెటిస్‌కి రెమెడీగా వాడొచ్చు. ఇంట్లో దొరికే దాల్చిన చెక్కను టీలో కానీ, గ్రీన్‌ టీలో కానీ, వార్మ్ వాటర్‌లో తీసుకుంటే మంచి ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు. మెంతులు రాత్రి పూట ఓ గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే నానబెట్టిన మెంతులను నమిలి మింగి ఆ నీటిని తాగితే కూడా చాలా మంచి ప్రయోజనం ఉందని అంటున్నారు. ఆహారంలో లవంగాలు, ఇలాచీలు, కరివేపాకు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. షుగర్‌ ఉంది అంటే అన్నం మానేయాలి, ఇడ్లీ, దోశ తినొద్దా అని ప్రశ్నిస్తారు. డయాబెటిస్‌ను మెటబాలిక్‌ సిండ్రోం అంటామని అది ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుందని చెప్తున్నారు. దీంతో మనిషికి డయాబెటీస్, ఒబెసిటీ, ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని అరికట్టేందుకు సకాలంలో ఫుడ్‌ తీసుకోవాలి. ఒకేసారి బంచ్‌ ఆఫ్ మీల్ తీసుకోకుండా ప్రతీ రెండు గంటలకోసారి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Updated On 10 Feb 2024 8:29 AM GMT
Ehatv

Ehatv

Next Story