మండిపోతున్న ఎండలో, పెళ్లిళ్ల సీజన్ లో తెలియడం లేదు కానీ చికెన్(Chicken) రేటు మాత్రం అమాంతం పెరిగింది. రోజురోజుకూ చికెన్ ధర పెరుగుతూ వెళుతోంది. ఆదివారం కిలో కోడి మాంసం ధర 250 రూపాయలకు చేరింది.
మండిపోతున్న ఎండలో, పెళ్లిళ్ల సీజన్ లో తెలియడం లేదు కానీ చికెన్(Chicken) రేటు మాత్రం అమాంతం పెరిగింది. రోజురోజుకూ చికెన్ ధర పెరుగుతూ వెళుతోంది. ఆదివారం కిలో కోడి మాంసం ధర 250 రూపాయలకు చేరింది. ఎండలు మండిపోతుండటం, వడగాడ్పులు వీస్తుండటంతో కోళ్ల ఫారాల్లోని కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా ఉత్పత్తులు బాగా పడిపోయాయి. చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. ఇప్పుడు రిటైల్‌గా స్కిన్‌లెస్ చికెన్ కిలో 250 రూపాయల వరకు ఉంది.
స్కిన్‌తో ఉన్న చికెన్ అయితే కిలో 220 రూపాయలకు అమ్ముతున్నారు. వారం రోజుల్లో కిలో చికెన్ రేటు 60 రూపాయల వరకు పెరిగింది. ఉత్పత్తేమో తగ్గింది. డిమాండేమో పెరిగింది. ఇక రేట్లు పెరగకుండా ఉంటాయా అని వ్యాపారులు అంటున్నారు. వచ్చే ఆదివారం వరకు రేటు మరింత పెరగవచ్చని చెబుతున్నారు. వేసవి సెలవులు, విపరీతమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు జరుగుతుండటం కూడా చికెన్ వినియోగం పెరగడానికి కారణాలయ్యాయి.