చికెన్(Chicken) తింటే మంచిదా కాదా..? తింటే ఎంత తినాలి..? చికెన్ కొవ్వు పెరిగేలా చేస్తుందా..? చాలా మంది చెప్పే వాదనలో నిజం ఎంత. అసలే మాంసాహారమే మంచిది కాదా.? ఏంటీ కన్ప్యూజన్. మన ఇండియా(India)లో ఒకప్పుడు శాకాహారులు ఎక్కువ కాని.. ఇప్పుడు మాత్రం ఇండియాలో శాఖాహారులకంటే.. మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో 78 శాతం మంది మగవారు..

చికెన్(Chicken) తింటే మంచిదా కాదా..? తింటే ఎంత తినాలి..? చికెన్ కొవ్వు పెరిగేలా చేస్తుందా..? చాలా మంది చెప్పే వాదనలో నిజం ఎంత. అసలే మాంసాహారమే మంచిది కాదా.? ఏంటీ కన్ప్యూజన్.

మన ఇండియా(India)లో ఒకప్పుడు శాకాహారులు ఎక్కువ కాని.. ఇప్పుడు మాత్రం ఇండియాలో శాఖాహారులకంటే.. మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో 78 శాతం మంది మగవారు.. 70 శాతం మంది ఆడవారు మన జనాబాలో మాంసాహారులుగా మారారు అనేది సర్వే. భారతదేశంలో శాకాహారుల కంటే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ అని సర్వే తేల్చింది.

ఈ మాంసాహారుల్లో కూడా ఎక్కువగా ప్రజలు చికెన్ తింటారుట. దానికి కారణం ఇందులో మటన్, బీఫ్ కంటే తక్కువ రేటుకు చికెన్ దొరకడంతోపాటు.. వాటికింటే చికెన్ లో కొవ్వు తక్కువగా ఉండటమే అనిసమాచారం. అయితే చికెన్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్లప్రశ్నగామిగిలిపోయింది.

రెడ్ మీట్‌లో ఉండే సంతృప్త కొవ్వు కారణంగా, కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి చాలా మంది డైటీషియన్లు చికెన్‌ను ఇతర నాన్-వెజ్ ఐటెమ్‌లతో పోల్చితే కాస్త ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. చికెన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి అనడంలో సందేహం లేదు, కానీ ఏదైనా ఎక్కువగా తినడం హానికరం, చికెన్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

చికెన్ మీ ఆరోగ్యానికి ప్రయోజనమే.. కాని అతిగా తింటేనే అది హానికరంగా మారుతుంది. . చికెన్ తో చేసే వంటల్లో మీరు ఎక్కువ నూనెను ఉపయోగించినట్లయితే, అది కొలెస్ట్రాల్‌ను మరింత పెంచుతుంది. అదే మంచి నూనెలు కాకుండా పిచ్చి పిచ్చి నూనెలు వాడితే.. అవి చికెన్ తో కలిసి ప్రాణలు కూడా తీస్తాయి. అంత ప్రమాదం.

మీరు చికెన్ తయారీలో ఎక్కువ వెన్న, నూనె లేదా ఏదైనా ఇతర కొవ్వును ఉపయోగిస్తే, అప్పుడు స్పష్టంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బటర్ చికెన్, చికెన్ ఫ్రై, కడాయి చికెన్, చికెన్ డీప్ ఫ్రై తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే చికెన్ తినండి కాని అదిమితంగా.. టైమ్ ప్రకారంతింటే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి ఒక సారి చికెన్ తింటే పెద్ద ఇబ్బంది లేదంటున్నారు.

Updated On 1 May 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story