నవరాత్రి ఉత్సవాలు చైత్రశుక్ల పాడ్యమి మార్చి 22 నుండి బుధవారం ఉగాది ఘడియల్లో నుండి మొదలవుతాయి . ఈ చైత్ర నవరాత్రులు దుర్గ దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .ఎలా అయితే దసరా రోజుల్లో నవరాత్రి పూజను ఉపవాస దీక్ష తో జరుపుకుంటారో ఈ చైత్ర నవరాత్రులు కూడా అంత పవిత్రమైనవే . ఉపవాసం తో పాటు ఆరోగ్యం కూడా పొందాలంటే ఎం చేయాలి ఎలా చేయాలి అనేదానికి ఒక ప్రణళిక ఉంటె మంచిది . తొమ్మిది […]
నవరాత్రి ఉత్సవాలు చైత్రశుక్ల పాడ్యమి మార్చి 22 నుండి బుధవారం ఉగాది ఘడియల్లో నుండి మొదలవుతాయి . ఈ చైత్ర నవరాత్రులు దుర్గ దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .ఎలా అయితే దసరా రోజుల్లో నవరాత్రి పూజను ఉపవాస దీక్ష తో జరుపుకుంటారో ఈ చైత్ర నవరాత్రులు కూడా అంత పవిత్రమైనవే . ఉపవాసం తో పాటు ఆరోగ్యం కూడా పొందాలంటే ఎం చేయాలి ఎలా చేయాలి అనేదానికి ఒక ప్రణళిక ఉంటె మంచిది . తొమ్మిది రోజులు ఉపవాసం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఏమి తింటున్నారో శ్రద్ధ వహించండి, ఆలా మీ ఉపవాసంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు .
నవరాత్రి ఉపవాస చిట్కాలు
- వేసవిలో వచ్చే చైత్ర నవరాత్రులలో కూడా, ప్రజలు దుర్గా మాత ను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు, కాబట్టి వారు పుష్కలంగా పండ్లు తినాలి. చిప్స్ లాంటివి తినవద్దు. దీని వల్ల గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఉపవాస సమయంలో తప్పనిసరిగా పాలు తాగాలి. పండ్లు తినడం మరియు నీరు ఎక్కువగా తాగడం వంటివి చేయండి .
- నవరాత్రులలో స్త్రీలకు చాలా పనులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, పూజలో నిమగ్నమై , ఆరోగ్యం పైన జాగ్రత్త మర్చిపోతువుంటాం . కానీ ఉపవాస సమయంలో ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉండాలి . ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల తలతిరగటం వంటివి వస్తుంటాయి . రక్తపోటు తగ్గుతుంది మరియు మధుమేహం సమస్య ఉంటే, పరిస్థితి మరింత దారుణంగా ఉండచ్చు కాబట్టి ప్రతి కొద్దిసేపు తినడానికి బదులుగా, కొన్ని గంటల వ్యవధిలో తినండి. వేసవిని దృష్టిలో ఉంచుకుని, పండ్లు, జ్యూస్‌లు, పెరుగు, షేక్స్ మరియు కొబ్బరి నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటు ఉండాలి .
కొన్ని ప్రాంతాల్లో నవరాత్రి వ్రతాన్ని స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఆచరిస్తారు, కానీ ఇంట్లో మరియు బయట పని కారణంగా, వారు తమ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేరు, దీని కారణంగా వ్రత సమయంలో ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. కాబట్టి దీనిని అధిగమించటానికి , మీరు కూడా ఆరోగ్యకరమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. టీ-కాఫీ ఎక్కువగా తాగవద్దు. దాని వలన ఇబ్బందులు ఉంటాయి .తేలికైన ఆహారాన్ని తింటు మనసు నిండా భక్తి తో అమ్మవారిని వివిధ రకాల నైవేద్యాలతో 9 రోజులు భక్తి శ్రద్దలతో కొలవండి . ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందగలరు .