చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి.. ఉదయాన్నే ఏంతినాలి అని. చాలా మంది చాలా రకాలుగా చెపుతుంటారు. అవి విని కన్ఫ్యూజ్ అవుతుంటాం.. ఇంకొందరు అయితే అసలు బ్రేక్ ఫాస్ట్ నే స్కిప్ చేస్తుంటారు. కాని ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్.. బ్రేక్ ఫాస్ట్ ఎంత తినాలి.. ఏం తినాలి..? అసలు తింటే మంచిదా ..? తినకపోతే మంచిదా తెలసుకుందా..

చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి.. ఉదయాన్నే ఏంతినాలి అని. చాలా మంది చాలా రకాలుగా చెపుతుంటారు. అవి విని కన్ఫ్యూజ్ అవుతుంటాం.. ఇంకొందరు అయితే అసలు బ్రేక్ ఫాస్ట్ నే స్కిప్ చేస్తుంటారు. కాని ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్.. బ్రేక్ ఫాస్ట్ ఎంత తినాలి.. ఏం తినాలి..? అసలు తింటే మంచిదా ..? తినకపోతే మంచిదా తెలసుకుందా..

చాలా మంది రకరకాల కారణాల వల్లమార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఫస్ట్ మీల్ బెస్ట్ మీల్ అనే మాట వినే ఉంటారు. ఉదయాన్నే తినే అల్పాహారమే మనకు ఎక్కువ శక్తినిస్తుంది. అలాగే మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.

అంతే కాదు ఉదయం బ్రేక్ ఫణాస్ట్ చేయకపనోతే.. మద్యాహ్నం ఎక్కువగా తినేస్తాం. అది మన బరువు పెంచుతుంది. అది ఇంకా ప్రమాదానికి దారి తీస్తుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలి అని చాలామందికి కన్ ఫ్యూజన్ ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో అవి ఇవి కాకుండా.. పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినడం మంచిది. ఎందుకంటే గంటల తరబడి ఆకలివేయకుండా.. శక్తిని కలిగి ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ మంచిదై ఉండాలి.

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు సాయంత్రం వరకూ చిరుతిండిపై మోహం కలగకుండా.. జంక్ ఫుడ్ కు సబంధించిన ఆహార కోరికలను నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఇవి మీ జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాహార నిపుణుల ప్రకారం, సరైన అల్పాహారం రెండు పనులను చేస్తుంది. ఒకటి మీ శరీరానికి అవసరమైన పోషక అవసరాలను తీరుస్తుంది. రెండు మీ శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది. ఒక సాధారణ ఆరోగ్యకరమైన అల్పాహారంలో ఎన్నో రకాల ఆహారాలు ఉంటాయి. తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్ లేదా పాల వనరులు, పండ్లు ఈ జాబితాలో ఉంటాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే చక్లిస్, వేయించిన దోశ, స్టఫ్డ్ పరాఠాలు, పూరీ బాజీ, బటాటా వడలు, లాంటి వంటి కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏదైనా ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం పడుతుందో.. అది మీ మానసిక శక్తిని తగ్గిస్తుంది.

ఉదయాన్నే పుదీనాతో కొత్తిమీర జ్యూస్ తాగండి.. ఆరోగ్యానికి మంచిది. టొమాటో-క్యారెట్ జ్యూస్ తాగడంతో పాటు.. పెసరపప్పు దోశ నూనె తక్కవు వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, సొరకాయ రసం, గోబీ, బ్రకోలీ లాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఉడికించిన గుడ్డు కాని.. బాదం పప్పులు కాని.. కొవ్వులు లేని జూస్ లు కాని తాగవచ్చు.. వాటితో పాటు తాజా పళ్లు కూడా బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి. ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేయండి ఆరోగ్యంగా ఉంటారు.

Updated On 17 April 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story