ఓ ప్రియుడు తన ప్రియురాలితో ఉన్న విరహవేదనను తట్టుకోలేకపోయాడు.

ఓ ప్రియుడు తన ప్రియురాలితో ఉన్న విరహవేదనను తట్టుకోలేకపోయాడు. తన ప్రియురాలిని బాయ్స్ హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు సూట్‌కేస్‌లో దాచి ప్రయత్నించాడు. హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో జరిగింది. విద్యార్థి పెద్ద సూట్‌కేస్‌లో తన ప్రియురాలిని దాచి, హాస్టల్‌లోకి తీసుకెళ్తుండగా, సూట్‌కేస్ ఒక్కసారిగా కదిలి, లోపల నుంచి అరుపు వినిపించింది. సెక్యూరిటీ గార్డులు అనుమానం వచ్చి సూట్‌కేస్(Suitcase)తెరవాలని అడిగారు. తెరిచి చూస్తే, లోపల అమ్మాయి కుంచించుకుని కూర్చుని ఉంది! ఎలా బయటపడింది? ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక విద్యార్థిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో సెక్యూరిటీ సూట్‌కేస్ తెరిచినప్పుడు అమ్మాయి బయటకు వస్తూ, ఇబ్బందిగా ఫీల్ అవుతూ కనిపించింది. ఈ జంటను హాస్టల్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని సమాచారం. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. కొందరు "మిషన్ ఇంపాసిబుల్.. హాస్టల్ ఎడిషన్" అంటూ జోకులు వేశారు, మరికొందరు "ప్రేమలో ఇంత రిస్క్‌ తీసుకున్నాడు, హ్యాట్సాఫ్" అని కామెంట్స్ చేశారు. బఇది పూర్తిగా కామెడీ ఘటనలా కనిపించినా, హాస్టల్ రూల్స్ ఉల్లంఘన విషయంలో యాజమాన్యం సీరియస్‌గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

Updated On 12 April 2025 12:30 PM GMT
ehatv

ehatv

Next Story