మసాలా దినుసులలో ఉపయోగపడే లవంగా(Clove), దాల్చిన చెక్కలాంటి(Cinnamon) ఎన్నో వాటి గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం.. ఇక ఇప్పుడు మిరియాల(pepper) వంతు వచ్చింది. మిరియాలో వాడని వారంటూ లేదు.. మన పెద్దలు.. దగ్గు జలుపు వంటి వాటికి ఔషదంలా.. ఇక చారు గట్రా కాచుకోవడానికి మిరియాలు వాడితే.. ఫ్యాషన్ యుగంలో..
మసాలా దినుసులలో ఉపయోగపడే లవంగా(Clove), దాల్చిన చెక్కలాంటి(Cinnamon) ఎన్నో వాటి గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం.. ఇక ఇప్పుడు మిరియాల(pepper) వంతు వచ్చింది. మిరియాలో వాడని వారంటూ లేదు.. మన పెద్దలు.. దగ్గు జలుపు వంటి వాటికి ఔషదంలా.. ఇక చారు గట్రా కాచుకోవడానికి మిరియాలు వాడితే.. ఫ్యాషన్ యుగంలో.. ఆ మిరియాలను పొటి చేసి..పెప్పర్ గా.. వాడుతున్నారు జంక్ ఫుడ్ లో..
ఏది ఏమైనా.. నల్ల మిరియాలు వల్ల(Black Peper) అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలను ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకుంటే, అది మన శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం.
కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ ఉంటే నిమ్మరసంలో(Lemon Juice) చిటికెడు బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బ్లాక్ పెప్పెర్ లో పైపెరిన్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా నల్ల మిరియాలు ప్రజల ఒత్తిడి, నిరాశను తొలగించడంలో సహాయపడతాయి.
నల్ల మిరియాలు చిగుళ్ల నొప్పికి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఎండుమిర్చి, జాజికాయ, రాళ్ల ఉప్పు ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపి పౌడర్‌లా చేసి కొన్ని చుక్కల ఆవాల నూనె కలిపి దంతాలకు, చిగుళ్లకు పట్టించి అరగంట తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ దంతాలు, చిగుళ్ల నొప్పి సమస్య కూడా దూరమవుతుంది.
నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సేసిన్ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. కఫ హరంగా ఉంటుంది.మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. కడుపులో మంట ఉన్నవారు మితంగా తీసుకోవాలి.