వాంతులు(Vomiting) చాలా భయంకరమైన ఇబ్బంది. చాలా మందికి కడుపులో తిప్పడం, తల తిరగడం, నోటిలో ఇబ్బంది అనిపించి వామిట్స్ అవ్వడం చూస్తూనే ఉంటాం. మరికొంత మందికి కారు ఎక్కినా, బస్ ఎక్కినా.. వెంటనే వాంతులు వస్తాయి. మరి వాటి నుంచి నేచురల్ పద్దతిలో బయటపడటం ఎలా..?వాంతులు తగ్గడానికి మన వంటింట్లోనే కొన్ని మందులు ఉన్నాయి. అందులు ముఖ్యంగా నిమ్మ బాగా పనిచేస్తుంది.

వాంతులు(Vomiting) చాలా భయంకరమైన ఇబ్బంది. చాలా మందికి కడుపులో తిప్పడం, తల తిరగడం, నోటిలో ఇబ్బంది అనిపించి వామిట్స్ అవ్వడం చూస్తూనే ఉంటాం. మరికొంత మందికి కారు ఎక్కినా, బస్ ఎక్కినా.. వెంటనే వాంతులు వస్తాయి. మరి వాటి నుంచి నేచురల్ పద్దతిలో బయటపడటం ఎలా..?

వాంతులు తగ్గడానికి మన వంటింట్లోనే కొన్ని మందులు ఉన్నాయి. అందులు ముఖ్యంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. కొన్ని మెంతులు(Fenugreek ).. నిమ్మరసం(Lemon Juice)తో తినేసోడా(Baking Soda) లో కలిపిన చిన్న పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చిన వెంటనే త్రాగినచో వాంతులు ఇట్టే మాయం అవుతాయి.

ఉసిరికాయరసం(Amla Juice)లో గంధపుచెక్క(Sandalwood)2 గ్రాములు కలిపి తగినంత తేనె(Honey)కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవడం వల్ల. కడుపులో వికారం తగ్గి.. వేడి వలన వచ్చే వాంతులు చిటికలో తగ్గిపోతాయి. అప్పటి వరకూ ఏం తినకపోతే.. వెంటనే ఆకలి కూడా పుడుతుంది.

కచూరాలు పొడిచేసి 1 లేక 2 గ్రాములు తేనెతో కలిపి.. చేతి మీద వేసుకుని నాకితే చాలు ... వాంతులు తగ్గును. తగ్గువారికి మాటిమాటికి చేయుచుండవలెను.

ఇక వెలగాకు రసంలో తేనెను కలిపి తాగినా కూడా వాంతులు వెంటనే తగ్గుతాయి. వీటితో పాటు మన వంటింటి పోపులతో ఉండే గి. జీలకర్ర, ధనియాలు, వాము సమభాగాలు వేయించుకొని.. గ్లాసు నీటిలో మరగబెట్టి.. సగం అయినంత వరకూ వేడి చేసి.. ఆ కషాయం తాగండి.. వాంతులు నుంచి ఉపశమనం లభిస్తుంది.

వరిపేలాలు, పంచదార కలిపి మెత్తగా పొడిచేసి తేనెతో కలిపి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా వాంతులు తగ్గుతాయి. అంతే కాదు పచ్చి చింతకాయ ను నోటిలో వేసుకుని నమిలితే.. వెంటనే వాంతులు తగ్గుతాయి.

Updated On 15 April 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story