శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. రక్తం నుండి వ్యర్థాలు, అదనపు నీరు, ఇతర మలినాలను తొలగించడం కిడ్నీల పని. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా పక్కటెముక దిగువ భాగంలో ఉంటాయి. ఆహారంలో నిర్లక్ష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు లేదా ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఆహారంపై దృష్టి పెట్టాలి.
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. రక్తం నుండి వ్యర్థాలు, అదనపు నీరు, ఇతర మలినాలను తొలగించడం కిడ్నీల పని. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా పక్కటెముక దిగువ భాగంలో ఉంటాయి. ఆహారంలో నిర్లక్ష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు లేదా ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఆహారంపై దృష్టి పెట్టాలి. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
1. యాపిల్
రోజుకో యాపిల్ తినండి.. డాక్టర్‌ని దూరంగా ఉంచండి అనే సామెతను మీరు వినే ఉంటారు. కిడ్నీ ఆరోగ్యాన్ని ఆపిల్ పెంపొందిస్తుంది. యాపిల్ గుండెకు కూడా బాగా పనిచేస్తుంది. యాపిల్‌లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. యాపిల్స్‌లో విటమిన్-సి తగినంత పరిమాణంలో లభిస్తుంది. యాపిల్స్ పచ్చివి కూడా తినవచ్చు.
2. బెర్రీలు
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే అనేక పోషక మూలకాలు వీటిలో ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో విటమిన్-సి, ఫైబర్ కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. బెర్రీలు తినడం వల్ల మూత్రపిండాల వ్యాధులతో పాటు, వివిధ రకాల క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. స్ట్రాబెర్రీ, జామకాయలను తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
3. నిమ్మ, నారింజ
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా విటమిన్-సి తినాలి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఇది తగినంత పరిమాణంలో ఉంటాయి. రోజూ నిమ్మరసం నీటిలో కలిపి తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి.
ఇవి కూడా..
బచ్చలికూరలో మూత్రపిండాల పనితీరును ప్రోత్సహించే విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి, ఎ, బి6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ తగిన మోతాదులో ఉండే కూరగాయలు తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధుల సమయంలో సూపర్ ఫుడ్ గా పనిచేస్తాయి. చిలగడదుంపలలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా చాలా మంచి ఎంపిక.
వీటికి దూరంగా..
కిడ్నీలకు హాని కలగకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరం ఉండాలి. దీర్ఘకాలిక మూత్రపిండ రోగులు మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బాదం వంటి భాస్వరం అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. రెడ్ మీట్ లో ఉండే ప్రోటీన్ మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు వైద్యుల ద్వారా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ముదిగిన తర్వాత ఏవి తిన్నా ఫలితం శూన్యం అన్న విషయం గుర్తుంచుకోవడం మంచిది.