చాలా మందికి రాత్రీ నిద్ర(Sleep) సరిగ్గా పట్టదు. అది వారి అలవాట్ల వల్ల కాని.. లేదా వారు తినే తిండి(Food) వల్ల కాని.. లేదా.. రకరకాల ఆలోచనల వల్ల కాని.. ఇలా జరుగుతుంటుంది. ఈక్రమంలో రాత్రి మంచి నిద్రకు కొన్ని ఆహారపు అలవాట్లు దోహదపడతాయి. అవి ఏంటంటే..?

Good Sleep Tips

బాదాం పాలు(Badam Milk) తాగండి.. అవి మీకు మంచి నిద్రను అందిస్తాయి. కడుపులో హాయిగా ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. రాత్రీళ్లు కొంత మందికి ఆకలితో నిద్ర పట్టదు. పడుకునేముందు బాదాం పాలు తాగితే.. ఆకలి వేయడు.. దాంతో నిద్ర బాగా పడుతుంది.
ఇక కాలరీలు చాలా తక్కువగా ఉన్న గ్రీ టీ వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. అందుకే రాత్రి పడుకోబోయే ముందు కాస్త గ్రీన్ టీ(Green Tea) తాగండి.. అది మంచి నిద్రను అందిస్తుంది.
చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిస్ నిద్రకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే పడుకునే మందు చెర్రీ పండ్ల జ్యూస్(Cheery Friut Juice) ను తాగడానికి ప్రయత్నించండి..అది మీకు మంచి నిద్రను అందిస్తుంది.
పాలు పసుపు(Turmeric Milk) ఆరోగ్యానికి చాలా మంచింది. గ్లాసు పాలల్లో.. ఓచిటికెడు మంచి పసుపు వేసుకుని గోరు వెచ్చగా తాగండి.. అది శరీరంలో చాలా రకాల వైరస్ లను తొలగించడంతో పాటు.. రాత్రిళ్లు మంచి నిద్రను అందిస్తాయి.
ఇవే కాదు.. పుదినీ టీ(Mint Tea), చామంతి టీ, అశ్వగంధ టీ లాంటివి కూడామంచి నిద్రను అందిస్తాయి. నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.