వేల సంవత్సరాల నుంచి తేనె(Honey) వాడకం ఉంది. పలు వ్యాధులను అది నయం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదంలో(Ayurveda) తేనెకున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. కాస్త ఖరీదైనా శుద్ధమైన తేనె కోసం ప్రయత్నిస్తుంటారు. అదర్సేగానీ మీకు ఎర్ర తేనె(Red Honey) తెలుసా? తేనెలాగే ఇది తీయ్యగా ఉంటుంది..

వేల సంవత్సరాల నుంచి తేనె(Honey) వాడకం ఉంది. పలు వ్యాధులను అది నయం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదంలో(Ayurveda) తేనెకున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. కాస్త ఖరీదైనా శుద్ధమైన తేనె కోసం ప్రయత్నిస్తుంటారు. అదర్సేగానీ మీకు ఎర్ర తేనె(Red Honey) తెలుసా? తేనెలాగే ఇది తీయ్యగా ఉంటుంది.. దీని ప్రత్యేకత ఏమిటంటే మత్తును కలిగించడం. పెద్ద తేనెటీగలు మాత్రమే ఈ తేనెను తయారు చేస్తాయి. వీటిని హిమాలయన్‌ క్లిఫ్‌ బీస్‌(Himalayan Cliff Bees) అంటారు. ఎర్ర తేనెను ఉత్పత్తి చేయడానికి హిమాలయన్‌ క్లిఫ్‌ బీస్‌ విషపూరితమైన పండ్ల రసాన్ని సేకరిస్తాయి. ఈ తేనెలో పలు ఔషధ గుణాలున్నాయి. పైగా ఎంతో మత్తునిస్తుంది. అందుకే ఈ ఎర్ర తేనెకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్‌ ఉంది. ఈ తేనెను పుచ్చుకుంటే లైంగిక సామర్థ్యం(Sexual ability) కూడా పెరుగుతుందని అంటుంటారు.

మధుమేహాన్ని(Diabetes)తగ్గిస్తుందట! అధిక రక్తపోటును(Blood Pressure) కంట్రోల్‌ చేస్తుందట! అందుకే ఎర్ర తేనెకు అంత డిమాండ్‌! అన్ని చోట్లా ఈ తేనె దొరకదు. కేవలం నేపాల్‌ శివారు ప్రాంతాలలోనే దొరుకుతుంది. పైగా ఈ తేనె తీయడం కష్టంతో కూడుకున్న పని. గురూంగా గిరిజన తెగ వారికి మాత్రమే ఇది సాధ్యం. వారు మాత్రమే చాకచక్యంగా తేనెను సేకరించగలుగుతారు. ముందుగా ఓ తాడు సాయంతో ఎన్నో అడుగుల ఎత్తయిన ప్రాంతానికి చేరుకుంటారు. తేనెతుట్టెను గుర్తించి పొగ పెడతారు. పొగకు తట్టుకోలేక తేనెటీగలన్నీ వెళ్లిపోయాక తుట్టెలోంచి తేనె సేకరిస్తారు. అప్పుడప్పుడు తేనెటీగల దాడికి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఎర్రతేనె అత్యధిక మత్తు కలిగిన ఎస్బింథే వంటిదే.. చాలా దేశాలలో ఎస్బింథేపై నిషేధం ఉంది. అందుకే ప్రత్యామ్నాయంగా దీన్ని పుచ్చుకుంటున్నారు చాలా మంది. అన్నట్టు ఎర్రతేనెను ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమేనట! గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.

Updated On 12 July 2023 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story