ఎన్నో ప్రయాసాలకు ఓర్చి శబరిమలకు(Sabarimala) వెళ్లే భక్తులకు అయ్యప్పస్వామిని దర్శించుకోగానే నూతనోత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. స్వామి దర్శనం తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు. బంధు మిత్రులకు ఇవ్వడం కోసం ప్రసాదం తీసుకు వస్తారు. అందరికీ సంతోషంగా ప్రసాదాన్ని పంచుతారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) తర్వాత ఎక్కువ మంది భక్తితో ఇష్టంగా స్వీకరించేది శబరిమలలో దొరికే అరవణి ప్రసాదమే(Aravana)
ఎన్నో ప్రయాసాలకు ఓర్చి శబరిమలకు(Sabarimala) వెళ్లే భక్తులకు అయ్యప్పస్వామిని దర్శించుకోగానే నూతనోత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. స్వామి దర్శనం తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు. బంధు మిత్రులకు ఇవ్వడం కోసం ప్రసాదం తీసుకు వస్తారు. అందరికీ సంతోషంగా ప్రసాదాన్ని పంచుతారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) తర్వాత ఎక్కువ మంది భక్తితో ఇష్టంగా స్వీకరించేది శబరిమలలో దొరికే అరవణి ప్రసాదమే(Aravana)! శబరిమల ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం(Rice), నెయ్యి(Ghee), బెల్లం(Jaggery) ఉపయోగించి ఈ ప్రసాదాన్ని తయారుచేస్తారు. శీతాకాలంలో ఈ ప్రసాదం తింటే ఆరోగ్యాన్ని మంచిదని చెబుతుంటారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం కూడా ప్రత్యేకమైనవే! మావెలిక్కరలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి బియ్యం వస్తాయి. చెట్టికులంగర దేవి ఆలయం ట్రావెన్‌కోర్(Travancore) దేవస్థానం బోర్డు ఆధీనంలోనే ఉంది. కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. అరవణ రుషి దీనిని మొదటిసారి తయారు చేశారట! అరవణన్ అంటే భగవంతుడనే అర్థం కూడా ఉందట! ఈ ప్రసాదాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం!
కావల్సిన పదార్థాలు
ఎర్రబియ్యం: ఒక కప్పు
నల్ల బెల్లం: రెండు కప్పులు
శొంటిపొడి: ఒక టీ స్పూన్
పచ్చి కొబ్బరి: ఒక కప్పు
నెయ్యి: తగినంత
జీడిపప్పు: పావు కప్పు
ఎలా తయారు చేయాలంటే...!
ముందుగా పాన్(Pan) మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. తర్వాత ఎర్రబియ్యాన్ని బాగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడుకుతున్నప్పుడే కాసింత నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఈ అన్నాన్ని బెల్లంపాకంలో వేసి ఉడికించుకోవాలి. శొంటిపొడి(Dry Ginger Powder), నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంతసేపు ఉడికించుకోవాలి. చివరగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న పచ్చికొబ్బరి(Coconut), జీడిపప్పులు వేసుకోవాలి. ఘుమఘుమలాడే రుచికరమైన ఆవరణ పాయం రెడీ