ఈరోజుల్లో మానవాళిని భయపెడుతున్న ముఖ్యమైన రెండు సమస్యల్లో షుగర్ (Sugar), బీపీ (BP) ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఈ మధుమేహం, అధికరక్తపోటు బాధిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, దైనందిన జీవితం, జీన్స్‌ ప్రభావంతో ఈ రోగాలు మనిషిని ఆవహిస్తున్నాయి. అయితే అధిక రక్తపోటుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలుంటున్నాయంటున్నారు ఆయుర్వేద (Ayurveda) వైద్యులు. ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని బీపీని అదుపులో ఉంచేందుకు మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో మనమూ చూద్దాం..!

అశ్వ‌గంధ (Ashwagandha): ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ అశ్వ‌గంధ పొడి క‌లిపి నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్పాహారానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు గోరవెచ్చని నీటితో తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బీపీ (Hyper Tension) త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. అశ్వగంధ చూర్ణంతో త‌యారు చేసిన ట్యాబ్లెట్లు కూడా ల‌భిస్తాయి.వీటిని ఉద‌యం సాయంత్రం తీసుకోవ‌చ్చు. ఈ ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

తుల‌సి (Tulsi): రోజూ ప‌ర‌గ‌డుపునే ఐదారు తుల‌సి ఆకుల‌ను న‌మిలి మింగాలి. లేదా తుల‌సి ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని కూడా తాగ‌వ‌చ్చు. తుల‌సి ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని కూడా వాడుకోవ‌చ్చు. తుల‌సి ఆకుల్లో ఉండే యుజినాల్ (Eugenol) అన‌బ‌డే స‌మ్మేళ‌నం హైబీపీని త‌గ్గిస్తుంది. తుల‌సిని వాడ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ (Respiratory tract) స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

ఉసిరి (Amla): నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక పెద్ద ఉసిరికాయ‌ను తినాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల ఉసిరికాయ ర‌సాన్ని క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఎండు ఉసిరికాయ‌ల పొడి కూడా ల‌భిస్తుంది. వీటిల్లో దేన్న‌యినా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఉసిరికాయ పొడిని వాడితే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల పొడిని క‌లుపుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయల‌ను వాడ‌డం వ‌ల్ల రోగనిరోధకశక్తి లభిస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాలు వెడ‌ల్పు అవుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా (Blood supply) మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

త్రిఫ‌ల (Triphala): ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌ల మిశ్ర‌మ‌మే త్రిఫ‌ల‌. త్రిఫ‌ల చూర్ణాన్ని వాడ‌డం వ‌ల్ల అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ (Inflammatory) గుణాలు హైబీపీని త‌గ్గిస్తాయి. రోజూ రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీ స్పూన్ల త్రిఫ‌ల చూర్ణాన్ని క‌లుపుకుని తాగడం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. ముఖ్యంగా కొలెస్ట్రాల్
(Cholesterol) త‌గ్గుతుంది

Updated On 7 Jan 2024 11:42 PM GMT
Ehatv

Ehatv

Next Story