చాలామంది గ్రహించడం లేదు కాని.. మన వంటిల్లే చాలా పెద్ద వైద్య శాల. జిలకర్ర,ధనియాలు. అల్లం, దాల్చి చెక్క, నువులు.. యాలకులు..ఇలా ఎనో పదార్ధాలు.. ఒక్కొక్కదాంటో ఒక్కో ఔషద గుణం ఉంటుంది. అటువంటి వాటిల్ ఇంగువ(asafoetida) కూడా ఒకటి. సాధారణంగా ఇంగువను వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. కానీ ఇంగువతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చన్న విషయం తెలుసా..?

డయాబెటీస్(Diabetes) తో బాధ పడేవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి వారికి ఇంగువ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంగువలో మధుమేహాన్ని కంట్రోల్ చేసే లక్షణాలు మెండుగా ఉన్నాయి.

ఇంగువ మూత్ర పిండాలు(Kidneys) ఆరోగ్యానికి కూడా బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు మూత్రంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న అదనపు క్రియాటినిన్, యరియాను కూడా బయటకు పండంలో ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల యూరిన్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఇంగువల వేసి పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.ఇలా పంటి ఆరోగ్యంలో కూడా ఇంగువా బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఇంగువను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయానికి సంబంధించి సమస్యలు రాకుండా చూస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి, అసిడిటీ, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి చేరవు.

Updated On 15 Sep 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story