గ్యాస్(Gas) మరియు అసిడిటీ(Acidity)రెండు అజీర్ణానికి చెందినవి. ఎప్పుడైన మంచి పనిలో ఉన్నప్పుడు ఇవి ఇబ్బంది పెడితే చిరాకు వస్తుంది. ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటాయయ్. కామన్ ప్రభ్లమ్ లా కనిపించినా ఇది చాలా పెద్ద సమస్య. ఇవి ఎవైన కారం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినటం వలన ఇవి కలుగుతాయి. అసిడిటీ అనేది జీర్ణాశయంలోని గ్రంధులు ఎక్కువగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేయటం వలన కలిగే సమస్య.

గ్యాస్(Gas) మరియు అసిడిటీ(Acidity)రెండు అజీర్ణానికి చెందినవి. ఎప్పుడైన మంచి పనిలో ఉన్నప్పుడు ఇవి ఇబ్బంది పెడితే చిరాకు వస్తుంది. ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటాయయ్. కామన్ ప్రభ్లమ్ లా కనిపించినా ఇది చాలా పెద్ద సమస్య. ఇవి ఎవైన కారం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినటం వలన ఇవి కలుగుతాయి. అసిడిటీ అనేది జీర్ణాశయంలోని గ్రంధులు ఎక్కువగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేయటం వలన కలిగే సమస్య. ఇలా ఆమ్లం ఉత్పత్తి పెరగడం వలన గుండె మంట మరియు కడుపులో నొప్పి కలుగుతాయి.

పుదీన అసిడిటీ చికిత్సకి బాగా పనిచేస్తుంది. ఇది ఎలా వాడాలి అంటే... ఉదయాన ఖాళీ కడుపుతో పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

కొబ్బరి నీరు ఆరోగ్య కారిని.... ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. కొబ్బరి నీటిని భోజన సమయంలో కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీరు కొంచెం తీసకుని ఆ తరువాత 20 నిమిషాల తరువాత బోజనం చేయండి మంచి ఫలితాన్నిఇస్తుంది.

అసిడిటీకి అద్భుత ఔషదం తులసి. భరతీయ వైద్య శాస్త్రంలో ఎంతో విలువైనది తులసి. తులసితో కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఎన్నో వైధ్య గుణాలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అసిడిటీకి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిరూపితం అయ్యింది...

ఇవే కాదు బత్తాయి కాయలు కూడా అసిడిటీకి బాగా పనిచేస్తాయి....ఒక గ్లాస్ తాజా బత్తాయి పండ్ల రసాన్ని తీసుకోండి దానికి కాల్చిన జీలకర్రని కలపండి. ఈ మిశ్రమాన్ని అసిడిటీ వచ్చిన వెంటనే తాగండి త్వరిత గతిన ఉపశమనం పొందుతారు. పూర్తిగా అసిడిటీ తగ్గడానికి ఎక్కవ రోజులు ఈ మిశ్రమాన్ని వరుసగా వారం రోజుల పాటు తాగడం మంచింది

భోజనానికి ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో రెండు లేదా మూడు చెంచాల నిమ్మరసాన్ని కలిపి తాగండి. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేయండి. ఇలా చేయడం వలన అసిడీటీ అనే మాట మీ దగ్గరకు రాదు. గ్యాస్ మరియు అసిడిటీలకు నిమ్మ ఒక శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదం.
అంతే కాదు అసిడిటీ రాగానే మీ సొంతంగా ఇంగ్లీష్ మందులు వాడకండి. డాక్టర్ సలహా లేకుండా ఇలా వాడటం వలన ప్రాణానికి ప్రమాదం రావచ్చు..

Updated On 1 April 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story