రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంపై బ్రేక్ ఫాస్ట్ ఆధారపడి ఉంటుంది. అందుకే లంచ్, డిన్నర్ మానేసినా.. బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కాకుండా.. అల్పాహారం ఎక్కువగా, మధ్యాహ్నం తక్కువగా..

అల్పాహారంలో రాగులు(Ragulu) చేర్చుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. రాగులను ఉదయం ఏదో ఒక రూపంలో తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంపై బ్రేక్ ఫాస్ట్ ఆధారపడి ఉంటుంది. అందుకే లంచ్, డిన్నర్ మానేసినా.. బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కాకుండా.. అల్పాహారం ఎక్కువగా, మధ్యాహ్నం తక్కువగా.. రాత్రిపూట తేలికగా తినండి. అప్పుడు ఆరోగ్యం మన సొంతమవుతుంది.

ఇక అసలు విషయాం ఏంటంటే.. అల్పాహారం ఏం తినాలి.. అందులో ఏం తింటే ఉపమోగం అనేది చూస్తే.. రాగులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం... రాగుల గురించి తెలియని వారు ఉండరు. ఇందులో ఎన్నో ఉపమోగకరమైన గుణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా... ఫైబర్, ప్రొటీన్లు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రాగులను రకరకాలుగా మన ఆహారంలో చేర్చవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే.. రాగి ఇడ్లీ, రాగి దోసె, రాగి ఉప్పు కలిపిన రాగులు, రాగుల గుజ్జు ఇలా ఏ పద్ధతిలో తిన్నా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది

రాగుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. అలాగే.. గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అలాంటివారు ప్రతిరోజూ అల్పాహారంలో రాగుల పిండితో చేసిన వంటకాలను తింటే ఐరన్ లోపం తగ్గుతుంది. అంతే కాకుండా.. బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారంలో ఒక రాగి జావ తాగితే కడుపు నిండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇది సులభంగా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

వీళ్లే కాదు...డయాబెటిక్ పేషంట్స్(Diabetic Patients) కూడా.. సందేహం లేకుండా.. రాగుల గుజ్జు, రాగి ఇడ్లీలు తింటే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. మీకు తెలుసా.. ఎముకలు దృఢంగా మారడంలో రాగులది ముఖ్యపాత్ర. ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. రాగులను జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రస్తుతం రాగి ముద్దు..నాన్ వెజ్ కూరలు బాగా ఫేమస్ అయ్యాయి కదా..

Updated On 10 April 2024 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story