అనేక అనారోగ్య సమస్యలకు కిచెన్‌ యే ఒక వైద్యశాల అని చెప్పవచ్చు . వివిధ మసాలా, తాలింపు దినుసులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో ఒకటి నల్ల జీలకర్ర. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది.

అనేక అనారోగ్య సమస్యలకు కిచెన్‌ యే ఒక వైద్యశాల అని చెప్పవచ్చు . వివిధ మసాలా, తాలింపు దినుసులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో ఒకటి నల్ల జీలకర్ర. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి మ‌నం అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. న‌ల్ల జీల‌క‌ర్ర వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల గురించి, దీనిని వాడ‌డం వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ల్ల జీల‌క‌ర్ర‌ను చేదు జీల‌క‌ర్ర అని కూడా అంటారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి ... అన్ని ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చని ఆయుర్వేద గ్రంథాల‌లో ఋషులు తెలిపారు . న‌ల్ల జీల‌క‌ర్ర‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. న‌ల్ల జీల క‌ర్ర‌లో ఉండే ర‌సాయ‌నిక ప‌దార్థాలు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నకు వ‌చ్చే క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌లు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర ఔష‌ధంగా ప‌ని చేస్తుంది.

శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగించంలో, బీపీని నియంత్రించ‌డంలో, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరంలో త‌గినంత ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. న‌ల్ల జీల‌క‌ర్ర యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంతో పాటు ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ జీల‌క‌ర్ర మ‌నకు తోడ్ప‌డుతుంది.

న‌ల్ల జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ క‌షాయాన్ని గోరు వెచ్చ‌గా ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటాం. న‌ల్ల జీల‌క‌ర్ర నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అంతేకాదు న‌ల్లజీల‌క‌ర్ర‌ను పొడిగా చేసి దానికి తేనెను క‌లిపి ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకున్నా కూడా మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. సో నల్ల జిలకర్ర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా...మరి ఇక రోజువారి డైట్లో నల్ల జిలకర ను చేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి.

Updated On 8 March 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story