కరోనా కాలంలో జీడిపప్పు(Cashew), బాదంపప్పు(Almond), పిస్తా(Pista) వగైరా వగైరాకు మస్తు డిమాండ్ వచ్చింది. ఇమ్యూనిటీ(Immunity) పెరగడానికి డ్రై ఫ్రూట్స్ తినాలని ఎక్స్‌పర్ట్స్ చెప్పడంతో అందరూ డ్రైఫ్రూట్స్ వెంటపడ్డారు. కర్బూజా గింజలను ఎండబెట్టుకుని మరీ తిన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పండ్లలో రారాజు మామిడి పండు ఎలాగో డ్రై నట్స్‌లో మెకడమియా నట్స్(Macadamia Nuts) అలాగట!
కరోనా కాలంలో జీడిపప్పు(Cashew), బాదంపప్పు(Almond), పిస్తా(Pista) వగైరా వగైరాకు మస్తు డిమాండ్ వచ్చింది. ఇమ్యూనిటీ(Immunity) పెరగడానికి డ్రై ఫ్రూట్స్ తినాలని ఎక్స్‌పర్ట్స్ చెప్పడంతో అందరూ డ్రైఫ్రూట్స్ వెంటపడ్డారు. కర్బూజా గింజలను ఎండబెట్టుకుని మరీ తిన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పండ్లలో రారాజు మామిడి పండు ఎలాగో డ్రై నట్స్‌లో మెకడమియా నట్స్(Macadamia Nuts) అలాగట! వీటిని తింటే శరీరం బలంగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు. వంద గ్రాముల మెకడమియా నట్స్‌లో 740 క్యాలరీల శక్తి ఉంటుందట. వంద గ్రాముల జీడిపప్పులో లభించే శక్తి కంటే చాలా ఎక్కువ. వంద గ్రాముల జీడిపప్పులో 596 క్యాలరీల శక్తి ఉంటే, పిస్తా పప్పులో 626 క్యాలరీల శక్తి, బాదం పప్పులో 655 క్యాలరీల శక్తి , వాల్ నట్స్ లో 687 క్యాలరీల శక్తి ఉంటుంది.వంద గ్రాముల చేపల్లో ఉండేది 80 క్యాలరీల శక్తే! అదే వంద గ్రాముల చికెన్‌లో 109 క్యాలరీల శక్తి ఉంటుంది. ఏ రకంగా చూసినా మెకడమియా నట్స్‌కు మించింది లేదనిపిస్తోంది. మెకడమియా నట్స్ లో శరీరానికి మేలుచేసే కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చాలా బలంగా మారడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మెకడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఈ నట్స్ ను మధుమేహ వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. వారికి ఇవి ఓ వరంలాంటివే! నీరసాన్ని దూరం చేస్తాయి. బలహీనతను తగ్గిస్తాయి. మెకడమియా నట్స్ తీసుకుంటే చాలా సేపు ఆకలి లేకుండా ఉండగలం. గర్భిణులు, బాలింతలు, పిల్లలు కూడా ఈ నట్స్ ను రోజూ తినవచ్చు. అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఊబకాయంతో బాధపడేవారు ఈ మెకడమియా నట్స్ ను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల హై బీపీ, అలాగే పక్షవాతం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. రోజుకు నాలుగైదు మెకడమియా నట్స్ నీళ్లల్లో నానబెట్టి తినాలి. పచ్చివి తింటే కడుపునొప్పి రావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.