జామకాయల(Guva) సీజన్ వచ్చేంది. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఈసీజన్ లో రోజు ఒక జామకాయ తినండి అది మీకు ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా..? జామకాయ ముఖ్యంగా డయాబెటిస్‌(Diabetes) కు సైలెంట్‌ కిల్లర్‌ అని చెప్పొచ్చు. ఒకసారి షుగర్ వస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయలేం. జీవించి ఉన్నంత కాలం బ్లడ్ లో షుగర్ కంట్రోల్ లో లేకపోతే..

జామకాయల(Guava) సీజన్ వచ్చేంది. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఈసీజన్ లో రోజు ఒక జామకాయ తినండి అది మీకు ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా..? జామకాయ ముఖ్యంగా డయాబెటిస్‌(Diabetes) కు సైలెంట్‌ కిల్లర్‌ అని చెప్పొచ్చు. ఒకసారి షుగర్ వస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయలేం. జీవించి ఉన్నంత కాలం బ్లడ్ లో షుగర్ కంట్రోల్ లో లేకపోతే.. దాని ప్రభావం శరీరం అంతా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ, నరాలు, కంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. షుగర్‌ ఫేషెంట్స్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకుంటే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మందులు వాడటం.. మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు కొన్ని సీజనల్ ప్రూట్స్(Seasonal Fruits) వల్ల కూడా షుగర్ కంట్రోల్లో(Sugar Control) ఉంటుంది అంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి.. అనేక రకాల పండ్లు, కూరగాయలు సహాయపడతాయి, వాటిలో జామ ఒకటి. జామకాయలో పోషకాలు నిండుగా ఉంటాయి. షుగర్‌ పేషెంట్స్‌కు జామకాయ ఔషధంలా పని చేస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో జామకాయ చేర్చుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇక జామకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా షుగర్ వ్యాధిని ఎలా తగ్గిస్తుందో చూద్దాం. జామకాయలో గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. జామకాయలో ఐరన్, ఫైబర్‌, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

జామకాయలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది, పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. పొటాషియం, సోడియం దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ అనేక సమస్యలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి.

ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ పేషెంట్స్‌కు జామకాయలో ఉండే పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. ఇక జామకాయలో మొత్తం ఫైబర్ ఉంటుంది, ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది, మీరు అతిగా తినడాన్ని నియంంత్రిస్తుంది. బరువును నియంత్రించడం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Updated On 16 Aug 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story